
ముంబై: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది.

భారీ వర్షం కారణంగా పలు రోడ్లు జలమయం అయ్యాయి. అంధేరి సబ్వే , లోఖండ్వాలా కాంప్లెక్స్ తదితర లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

























