
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన సంచలన బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును సిరాజ్ తీర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ మియా ఆరు వికెట్లతో సత్తాచాటాడు.
రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన సిరాజ్.. ఆ తర్వాత మూడో రోజు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లీష్ జట్టు టెయిలాండర్లను ఈ హైదారబాదీ వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు.
ఒక ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. తన ప్రదర్శనపై మూడో రోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమని అతడు చెప్పుకొచ్చాడు.
"ఇంగ్లండ్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అందుకే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజానికి నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు నాలుగు వికెట్లకు మించి తీయలేదు.
ఇప్పుడు ఆరు వికెట్లు సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. పిచ్ నెమ్మదిగా ఉన్నా క్రమశిక్షణతో సరైన చోట బంతులు వేస్తే ఫలితం రాబట్టవచ్చని నమ్మాను. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నిరోధించే ప్రయత్నం చేశాను. మిగతా ఇద్దరితో పోలిస్తే నాకే అనుభవం ఎక్కువ కాబట్టి ఆ సవాల్‌ను స్వీకరించి బాధ్యతగా బౌలింగ్ చేశాను. బుమ్రా లేకపోవడంతో పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేశాను" అని విలేకరుల సమావేశంలో సిరాజ్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 303 పరుగులు జోడించారు.
భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్‌గా