
ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా(Teamindia) 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఈ మైదానంలో ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టులో కూడా గెలవని భారత జట్టు.. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు సిద్దమైంది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి. అయితే గెలుపు ముంగిట భారత జట్టును వరుణుడు భయపెడుతున్నాడు. ఆఖరి రోజుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం ఉదయం మ్యాచ్ ప్రారంభ సమయంలో 60 శాతం వర్షం కురిసేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూ వెదర్ తమ రిపోర్టులో పేర్కొంది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని ఆక్యూ వెదర్ తెలిపింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైతే ఇంగ్లండ్ కచ్చితంగా డ్రా కోసం ఆడుతోంది.
అయితే మరోవైపు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఇన్నింగ్స్‌ను లేట్‌గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.
కాగా ఓవర్‌నైట్ స్కోరు 64/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.
చదవండి: IND vs ENG: శుబ్‌మన్ గిల్ వరల్డ్ రికార్డు.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి