source: X
సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు నిరాశ ఎదరైంది. డిఫెండింగ్ ఛాంపియన్లు త్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్‌తో పాటు యువ సంచలనం తన్వి శర్మ టైటిళ్లు గెలిచే అవకాశాలు కోల్పోయారు. ఇవాళ జరిగిన ఫైనల్లో వీరు ప్రత్యర్దుల చేతుల్లో ఓడారు. దీంతో స్వదేశంలో రెండు టైటిళ్లు సాధించాలన్న భారత ఆశలు ఆవిరయ్యాయి.
మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ త్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ.. ఇండోనేషియాకు చెందిన నాలుగో సీడ్ ఇస్యానా స్యాహిరా మెయిడా-రింజాని క్విన్నారా నస్టైన్ జంట చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్ గెలిచి శుభారంభం చేసిన భారత జోడీ.. చివరకు 24-22, 12-21, 19-21తో ఓటమి పాలైంది.
తన్వి శర్మకూ తప్పని ఓటమి
మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ తన్వి శర్మ కూడా టైటిల్‌ను చేజార్చుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ సుపనిదా కటెథాంగ్ చేతిలో 21-11, 12-21, 15-21తో ఓడిపోయింది. 17 ఏళ్ల తన్వి తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
ఇదీ చదవండి: బీజేపీలోకి షమీ..?


