breaking news
gayatri gopichand
-
ఆర్థిక కష్టాలు.. కూతురి కోసం ఇంట్లోనే ‘కోర్టు’ నిర్మించి.. ఇలా
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పుల్లెల గాయత్రి గోపీచంద్- ట్రెసా జాలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో ఈ జోడి కాంస్యంతో మెరిసింది. ఆ సమయంలో పుల్లెల గాయత్రి తండ్రి, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, చీఫ్ నేషనల్ కోచ్ గోపీచంద్ కూడా ఢిల్లీలోనే ఉండి మ్యాచ్‌ను వీక్షించాడు.తన కుమార్తె గాయత్రి, ట్రెసా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. నిజానికి బ్యాడ్మింటన్ గురించి తెలిసిన వారికి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కూతురు గాయత్రి తండ్రి అడుగుజాడల్లో బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుని ముందుకు సాగుతోంది.అయితే, గాయత్రి- ట్రెసా సాధించిన విజయం మరో వ్యక్తి కళ్లు కూడా ఆనందంతో చెమర్చేలా చేసింది. ఆయన మరెవరో కాదు ట్రెసా తండ్రి జాలీ మాథ్యూ. కేరళకు చెందిన ఆయన కూతురి కోసం స్వయంగా బ్యాడ్మింటన్ కోర్టును నిర్మించాడు. అన్నీ తానై కూతురిని ముందుకు నడిపి ఆమెను ఈస్థాయికి చేర్చాడు.పీఈటీ టీచర్.. వాలీబాల్ కోచ్కేరళలోని చెరుప్పుళ అనే చిన్న పట్టణం. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టులు లేవు. అయితే, జామీ మాథ్యూ మాత్రం తన కూతురి కల నెరవేరాలంటే తాను శ్రమించక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. జాలీ మాథ్యూ పీఈటీ టీచర్. అంతేకాదు ఆయన వాలీబాల్ కోచ్ కూడా!ఇంటి ఆవరణలోనే..తన ఇంటి ఆవరణలోనే వాలీబాల్ కోర్టును నిర్మించి.. అక్కడే యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేవాడు. ట్రెసా, ఆమె అక్కడ పక్కన నిలబడి వారి ఆటను చూస్తూ ఉండేవారు. తన కూతుళ్లు ఇద్దరు ఆసక్తిగా వాలీబాల్‌ను వీక్షించడం చూసిన మాథ్యూ.. ఇద్దరూ వాలీబాల్ ప్లేయర్లు అవుతారని ఊహించారు. అయితే, ట్రెసాకు బ్యాడ్మింటన్‌లో మరింత ఆసక్తి ఉందని గమనించి ఆ దిశగా ప్రోత్సహించాడు.ఈ విషయం గురించి మాథ్యూ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ట్రెసాకు ఆటల పట్ల అమితాసక్తి ఉండేది. నేను ఇంట్లోనే చాలా మంది అమ్మాయిలకు వాలీబాల్ శిక్షణ ఇచ్చాను. నా కూతుళ్లకు కూడా ఎందుకు ట్రెయినింగ్ ఇవ్వకూడదనే ప్రశ్న తలెత్తింది.ఇండోర్ కోర్టు నిర్మించి..ట్రెసా బాగా ఆసక్తిగా ఉండేది. అయితే, బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టాక తన ఆసక్తి మారిపోయింది. అయితే, మా ప్రాంతంలో అసలు బ్యాడ్మింటన్ కోర్టులు లేవు. అందుకే నేనే మా ఇంట్లో ఓ ఇండోర్ కోర్టు కట్టించి.. అక్కడే ట్రెసాకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను.ఆర్థికంగా కష్టాలు అయితే, గాలితో కూడిన వర్షం పడినప్పుడు టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయేవి. దీంతో ప్రాక్టీస్ కష్టమయ్యేది. ఆర్థికంగా కూడా కష్టాలు మొదలయ్యాయి. ఓసారి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు వెళ్లాము. అప్పుడే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థమైంది.స్థానిక ర్యాంకింగ్స్ ఆధారంగానే కేరళ జట్టుకు ఎంపిక చేస్తారనే విషయం తెలిసింది. వివిధ లోకల్ టోర్నీల్లో ఆడేందుకు మేము రాష్ట్రమంతా తిరిగేవాళ్లము. కానీ మాకు స్పాన్సర్లు దొరకలేదు. డబ్బుకు బాగా ఇబ్బంది అయ్యేది. ఏ అసోసియేషన్ కూడా మాకు సాయం చేయలేదు. దీంతో ఖర్చుల భారం తడిసిమోపెడు అయ్యేది.అయితే, ఆశయం నుంచి మేము ఎప్పుడూ దూరం కాలేదు. నిజానికి ట్రెసా చదువులో ముందు ఉండేది. మా ఊర్లో పిల్లలంతా డాక్టర్, ఇంజనీర్.. లేదంటే మరేదైనా ఉద్యోగం కోసం చదివేవాళ్లు. ఊర్లో ఎంతో మంది ఇంజనీర్లు ఉండవచ్చు. కొంతమంది డాక్టర్లూ ఉండొచ్చు. కానీ భారత్‌కు ఆడిన ప్లేయర్లు ఎంతో మంది ఉండరు కదా!అనిల్.. ఆ తర్వాత గోపీచంద్ట్రెసా ముందు దేశానికి ఆడాలి. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు వెళ్లాలి. అక్కడా పతకం గెలవాలి. ఇదే మా ధ్యేయం. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాము. నా స్నేహితుడు అనిల్ రామంద్రన్.. కన్నూరు యూనివర్సిటీ స్పోర్ట్స్ హెడ్, బ్యాడ్మింటన్ స్పెషలిస్టు. ఆయనే నా కూతురికి కోచింగ్ ఇచ్చాడు.ఆ తర్వాత గోపీచంద్‌ను కలిశాము. టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (TOPS)కి ట్రెసా ఎంపికైనపుడు ఆమె ప్లస్ వన్ చదువుతోంది. ఆ సమయంలో హైదరాబాద్‌లో సీనియర్క్యాంపులో ఉన్న గోపీచంద్‌కు రిపోర్టు చేసేది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది’’ అని జాలీ మాథ్యూ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు.కాగా జూనియర్ లెవల్లో ప్రతిభ కనబరిచిన గాయత్రి, ట్రెసాను కలిపి డబుల్స్ జోడీగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి జట్టుగా కొనసాగిన వీళ్లిద్దరు.. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత తొలిసారి భారత్‌కు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం అందించారు. ఇక గాయత్రి, ట్రెసాలకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.చైనా జంట చేతిలో పరాజయంన్యూఢిల్లీ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో గాయత్రి–ట్రెసా జంట 21–18, 13–21, 8–21 స్కోరుతో చైనాకు చెందిన వరల్డ్ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ జంట ల్యూ షెంగ్ షూ – టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 71 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో భారత జంట తొలి గేమ్‌ను గెలుచుకున్నా...ఆపై పట్టు కోల్పోయింది.ఈ మ్యాచ్‌కు ముందు చైనా జోడితో ఏడు సార్లు తలపడి ఒకే ఒక సారి గెలిచిన భారత ద్వయం ఈ సారి కూడా ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్‌లో తొలి గేమ్ ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో గాయత్రి–ట్రెసా 7–2తో ముందంజ వేయగా, వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన చైనా జంట 11–7తో నిలిచింది. ఆ తర్వాత హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు 12–12 నుంచి 18–18 వరకు చేరాయి. ఈ దశలో ట్రెసా క్రాస్ కోర్ట్ విన్నర్‌తో భారత్‌కు పాయింట్ దక్కగా, టాన్ వరుసగా రెండు సార్లు షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో గేమ్ ముగిసింది.అభిమానుల ప్రోత్సాహం మధ్య ఆట కొనసాగించిన భారత జోడి రెండో గేమ్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో స్కోరును 12–12 వరకు చేర్చింది. అయితే ఈ స్థితిలో ఒక్కసారిగా చైనా జోడి చెలరేగిపోయింది. పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ వరుసగా 8 పాయింట్లు సొంతం చేసుకొని 20–12కు దూసుకుపోయింది. ఆ తర్వాత మరో పాయింట్ సాధించడంతో గేమ్ చైనా వశమైంది. మూడో గేమ్‌లో పూర్తిగా చైనా హవానే సాగింది. 3–2తో ముందంజ వేసిన తర్వాత చైనా ఎక్కడా తగ్గలేదు. 8–5 నుంచి 15–5 వరకు ఆధిక్యంలో ఉన్న చైనా ఆ తర్వాత అలవోక పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. -
కాంస్యంతో సరిపెట్టుకున్న ట్రీసా-గాయత్రీ జోడీ
BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ జోడీ లియు షెంగ్షు-టాన్ నింగ్ చేతిలో 21-18, 12-21, 8-21 తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత్ తరఫున పతకం సాధించిన ఏకైక జోడీగా ట్రీసా-గాయత్రీ నిలిచారు.దూకుడుగా ప్రారంభించినప్పటికీ..!ట్రీసా-గాయత్రీ జోడీ మ్యాచ్‌ను దూకుడుగా ప్రారంభించారు. 3-0 ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ చైనా జోడీ వేగంగా పుంజుకుని 7-7తో స్కోరును సమం చేసింది. విరామ సమయానికి లియు-టాన్ 11-7తో ఆధిక్యంలో నిలిచారు.అయితే భారత జోడీ వెనక్కి తగ్గలేదు. విరామం తర్వాత వరుస పాయింట్లతో పుంజుకుని 12-12తో స్కోరును సమం చేసింది. చివర్లో 18-18 వద్ద కీలకంగా ఆడిన ట్రీసా-గాయత్రీ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21-18తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు.రెండో గేమ్‌లో పుంజుకున్న ప్రత్యర్దిరెండో గేమ్‌లో లియు-టాన్ దూకుడుగా ఆడారు. గాయత్రీ చైనా జోడీ బ్యాక్‌హ్యాండ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యూహం మార్చడంతో భారత్ కొంత మేర ఫలితం సాధించింది. ఒక దశలో భారత్ 11-10తో ఆధిక్యంలోకి కూడా వచ్చింది.అయితే ఆ తర్వాత నెట్ వద్ద జరిగిన పొరపాట్లు భారత జోడీని దెబ్బతీశాయి. అనవసర తప్పిదాలతో చైనా జోడీ 18-12 ఆధిక్యంలోకి వెళ్లింది. ట్రీసా-గాయత్రీ తిరిగి పుంజుకోలేకపోవడంతో రెండో గేమ్‌ను 12-21తో కోల్పోయారు.నిర్ణయాత్మక గేమ్‌లో ఆధిపత్యంమూడో గేమ్ ఆరంభంలో ఇరు జోడీలు సమానంగా పోరాడినా.. లియు షెంగ్షు-టాన్ నింగ్ క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధించారు. భారత జోడీ ఆటను చైనా క్రీడాకారిణులు సమర్థంగా చదివి వ్యూహం మార్చడంతో ట్రీసా-గాయత్రీకి పాయింట్లు రావడం కష్టమైంది.విరామ సమయానికి చైనా జోడీ 11-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఒత్తిడిని కొనసాగిస్తూ వరుస పాయింట్లు సాధించింది. చివరకు నిర్ణయాత్మక గేమ్‌ను 21-8తో గెలిచి, మ్యాచ్‌ను 2-1తో సొంతం చేసుకుంది.సెమీఫైనల్లో ఓటమి ఎదురైనా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ ప్రదర్శన భారత బ్యాడ్మింటన్‌కు భారీ ఊరటనిచ్చింది. -
సెమీస్‌కు దూసుకెళ్లిన గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
న్యూఢిల్లీ వేదికగా జరుగున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ - గాయత్రి గోపీచంద్ సత్తాచాటారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చైనాకు చెందిన నాలుగో సీడ్ జై యి ఫాన్ - జాంగ్ షు క్సియాన్పై విజయం సాధించిన ఈ భారత జంట.. సెమీస్‌కు దూసుకెళ్లింది. దీంతో 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు పతకం రానుంది. చివరిసారిగా 2011లో లండన్ వేదికగా జరిగిన టోర్నమెంట్లో అశ్విని పొన్నప్ప - జ్వాలా గుత్తా జోడీ కాంస్య పతకం సాధించింది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. గాయత్రి- ట్రీసా జాలీ జోడీ తొలి గేమ్‌ను 16-21తో కోల్పోయింది. కానీ రెండో గేమ్‌లో భారత షట్లర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. హోరాహోరీగా సాగిన రెండోగేమ్‌లో 21-15 తేడాతో భారత్ గెలిచి సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ గాయత్రి-ట్రీసా సత్తాచాటారు. 21-13 తేడాతో చైనా జోడీని చిత్తు చేసి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను భారత జంట సొంతం చేసుకుంది. కాగా గాయత్రి గోపీచంద్ ఇటీవలే అర్జున అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
వరల్డ్ ఛాంపియన్షిప్స్ క్వార్టర్స్‌లోకి ట్రీసా-గాయత్రీ జోడీ
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ అదరగొడుతోంది. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ రిన్ ఇవానాగా-కీ నకనిషి జోడీని వరుస గేముల్లో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో పతకానికి భారత్ మరో అడుగు దూరంలో నిలిచింది.అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ట్రీసా-గాయత్రీ జోడీ.. ప్రపంచ 7వ ర్యాంక్‌లో ఉన్న జపాన్ జోడీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం 41 నిమిషాల్లోనే 21-16, 21-12తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. తొలి గేమ్‌లో ఆరంభం నుంచే ఆధిక్యం ప్రదర్శించిన భారత జోడీ.. రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.పీవీ సింధు ముందంజఇదే టోర్నీలో భారత మహిళల సింగిల్స్ స్టార్ పీవీ సింధు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 49వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ వెన్ యు జాంగ్‌తో 35 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 21–16, 21–17తో గెలిచింది. ఇవాళ జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో సింధు తలపడుతుంది. మహిళల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన ఉన్నతి హుడా రెండో రౌండ్లోనే వెనుదిరిగింది.ప్రిక్వార్టర్స్‌లో ఆయుశ్ శెట్టిపురుషుల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో ఆయుశ్ శెట్టి కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–10తో దుమిందు అబేవిక్రమ (శ్రీలంక)పై గెలుపొందాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో ఆయుశ్ తలపడతాడు. పతకం తెస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న భారత నంబర్‌వన్, ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ అనూహ్య పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. -
‘అర్జున’ గాయత్రి, ధనుష్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న’ అవార్డీ లేకుండానే 2025 సంవత్సరానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడా కారులకు అందించే ‘అర్జున అవార్డు’ కోసం 17 మందిని ఎంపిక చేశారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారం ఐదుగురిని వరించింది. తెలంగాణ నుంచి ఇద్దరు ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ లభించింది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ పుల్లెల గాయత్రి... బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ ‘అర్జున అవార్డు’ అందుకోనున్నారు. ప్రపంచకప్ చెస్ విజేత దివ్య దేశ్‌ముఖ్, కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో రెండు వేర్వేరు ఈవెంట్స్‌లో పతకాలు గెలిచిన అథ్లెట్ తేజస్విన్ శంకర్ కూడా ‘అర్జున’ జాబితాలో ఉన్నారు. గాయత్రి 2015లో ఆసియా అండర్–15 చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కేరళకు చెందిన ట్రెసా జాలీతో జతగా బ్యాడ్మింటన్లోని అన్ని ప్రముఖ టోర్నిల్లో పాల్గొన్న గాయత్రి తన కెరీర్లో మొత్తం ఐదు డబుల్స్ అంతర్జాతీయ టైటిల్స్‌ను సాధించింది. గాయత్రితోపాటు ట్రెసా జాలీకి కూడా అర్జున అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్ రెండు వరుస (2022, 2025) బధిర ఒలింపిక్స్ క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్స్‌లో «పసిడి పతకాలు గెలిచాడు. న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న’ అవార్డీ లేకుండానే 2025 సంవత్సరానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడా కారులకు అందించే ‘అర్జున అవార్డు’ కోసం 17 మందిని ఎంపిక చేశారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారం ఐదుగురిని వరించింది. తెలంగాణ నుంచి ఇద్దరు ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ లభించింది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ పుల్లెల గాయత్రి... బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ ‘అర్జున అవార్డు’ అందుకోనున్నారు. ప్రపంచకప్ చెస్ విజేత దివ్య దేశ్‌ముఖ్, కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో రెండు వేర్వేరు ఈవెంట్స్‌లో పతకాలు గెలిచిన అథ్లెట్ తేజస్విన్ శంకర్ కూడా ‘అర్జున’ జాబితాలో ఉన్నారు. గాయత్రి 2015లో ఆసియా అండర్–15 చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కేరళకు చెందిన ట్రెసా జాలీతో జతగా బ్యాడ్మింటన్లోని అన్ని ప్రముఖ టోర్నిల్లో పాల్గొన్న గాయత్రి తన కెరీర్లో మొత్తం ఐదు డబుల్స్ అంతర్జాతీయ టైటిల్స్‌ను సాధించింది. గాయత్రితోపాటు ట్రెసా జాలీకి కూడా అర్జున అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్ రెండు వరుస (2022, 2025) బధిర ఒలింపిక్స్ క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్స్‌లో «పసిడి పతకాలు గెలిచాడు. జూనియర్ ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్‌లో, జూనియర్ ప్రపంచకప్‌లో నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నాడు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలో భారత ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ షూటర్ గగన్ నారంగ్, బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ అపర్ణ పోపట్, మాజీ హాకీ ప్లేయర్ సోమయ్య సభ్యులుగా ఉన్న సెలెక్షన్ కమిటీ ‘అర్జున అవార్డు’ కోసం 24 మంది పేర్లను సిఫారసు చేయగా... కేంద్ర క్రీడా శాఖ 17 మంది పేర్లను ఆమోదించింది. 2014 తర్వాత ‘ఖేల్ రత్న’ ఎవరికీ లభించకపోవడం ఇదే తొలిసారి.జాతీయ క్రీడా అవార్డీల వివరాలుఅర్జున అవార్డు (రెగ్యులర్): తేజస్విన్ శంకర్, అజ్మల్, ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్), పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ (బ్యాడ్మింటన్), నరేందర్ (బాక్సింగ్), దివ్య దేశ్‌ముఖ్, విదిత్ (చెస్), ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్), రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా షూటింగ్), అఖిల్ షెరోన్ (షూటింగ్), లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్ (హాకీ), సుర్జీత్, పూజ (కబడ్డీ), ఏక్తా భ్యాన్ (పారా అథ్లెటిక్స్), అరవింద్ సింగ్ (రోయింగ్). లైఫ్‌టైమ్: అరుమైనయాగం (ఫుట్‌బాల్). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్): పరీ్వర్ సింగ్ (అథ్లెటిక్స్), చోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా (షూటింగ్). లైఫ్‌టైమ్: ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేంద్ర కుమార్ (రెజ్లింగ్). రా్రïÙ్టయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: ఆర్మీ పారాలింపిక్ నోడ్ (పుణే). జూనియర్ ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్‌లో, జూనియర్ ప్రపంచకప్‌లో నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నాడు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలో భారత ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ షూటర్ గగన్ నారంగ్, బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ అపర్ణ పోపట్, మాజీ హాకీ ప్లేయర్ సోమయ్య సభ్యులుగా ఉన్న సెలెక్షన్ కమిటీ ‘అర్జున అవార్డు’ కోసం 24 మంది పేర్లను సిఫారసు చేయగా... కేంద్ర క్రీడా శాఖ 17 మంది పేర్లను ఆమోదించింది. 2014 తర్వాత ‘ఖేల్ రత్న’ ఎవరికీ లభించకపోవడం ఇదే తొలిసారి.జాతీయ క్రీడా అవార్డీల వివరాలుఅర్జున అవార్డు (రెగ్యులర్): తేజస్విన్ శంకర్, అజ్మల్, ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్), పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ (బ్యాడ్మింటన్), నరేందర్ (బాక్సింగ్), దివ్య దేశ్‌ముఖ్, విదిత్ (చెస్), ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్), రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా షూటింగ్), అఖిల్ షెరోన్ (షూటింగ్), లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్ (హాకీ), సుర్జీత్, పూజ (కబడ్డీ), ఏక్తా భ్యాన్ (పారా అథ్లెటిక్స్), అరవింద్ సింగ్ (రోయింగ్). లైఫ్‌టైమ్: అరుమైనయాగం (ఫుట్‌బాల్). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్): పరీ్వర్ సింగ్ (అథ్లెటిక్స్), చోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా (షూటింగ్). లైఫ్‌టైమ్: ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేంద్ర కుమార్ (రెజ్లింగ్). రా్రïÙ్టయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: ఆర్మీ పారాలింపిక్ నోడ్ (పుణే). -
ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన త్రీసా-గాయత్రీ జోడీ
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ త్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సంచలన విజయం సాధించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 16వ సీడ్ అమెరికా జోడీ లారెన్ లామ్–అల్లిసన్ క్విన్ లీని వరుస గేముల్లో ఓడించి ప్రీ-క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది.త్రీసా-గాయత్రీ జోడీ కేవలం 38 నిమిషాల్లో 21-15, 21-12 తేడాతో అమెరికా జోడీని చిత్తు చేసింది. ఆరంభం నుంచే త్రీసా–గాయత్రీ దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచారు.త్రీసా పవర్ఫుల్ స్మాష్‌లతో పాయింట్లు సాధించగా.. గాయత్రీ ర్యాలీలను కొనసాగిస్తూ చక్కటి డ్రాప్ షాట్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. దీంతో తొలి గేమ్‌ను 21-15తో సొంతం చేసుకుంది.రెండో గేమ్‌లోనూ భారత జోడీ అదే దూకుడును కొనసాగించింది. విరామ సమయానికి 11-4 ఆధిక్యం సాధించింది. ప్రత్యర్థుల అనవసర తప్పిదాలను కూడా సద్వినియోగం చేసుకున్న త్రీసా–గాయత్రీ.. వేగవంతమైన కదలికలు, అద్భుతమైన లైన్ జడ్జ్‌మెంట్‌తో మ్యాచ్‌ను 21-12తో ముగించింది.కవిప్రియ–సిమ్రన్‌కు నిరాశమరో భారత మహిళల డబుల్స్ జోడీ కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింఘి మాత్రం రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. 9వ సీడ్ బల్గేరియా జోడీ గాబ్రియేలా స్టోయేవా–స్టెఫానీ స్టోయేవా చేతిలో 7-21, 14-21తో ఓటమిపాలైంది. కేవలం 32 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు నిరాశమిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీలకు శుభారంభం దక్కలేదు. రోహన్ కపూర్–రుత్విక శివాని గద్దె జోడీ కెనడాకు చెందిన జొనాథన్ బింగ్ త్సాన్ లై–క్రిస్టల్ లై చేతిలో 22-20, 19-21, 17-21తో పోరాడి ఓడింది.మరో జోడీ అశిత్ సూర్య–అమృత ప్రముతేష్ కూడా టర్కీకి చెందిన ఎమ్రే సోన్మెజ్–యాసెమెన్ బెక్టాస్ జోడీ చేతిలో తీవ్ర పోరాటం తర్వాత 21-16, 29-30, 22-24తో పరాజయం పాలైంది.అయితే 15వ సీడ్ భారత జోడీ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ఇంకా పోటీలో ఉంది. తొలి రౌండ్లో బై లభించడంతో.. రెండో రౌండ్లో మకావుకు చెందిన ఐక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్జీ జోడీతో తలపడనుంది.ఉనతి హుడాకు రెండో రౌండ్లోకి ప్రవేశంమహిళల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ ఉనతి హుడా కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మయన్మార్‌కు చెందిన థెట్ హ్తార్ తుజార్‌ను 22-20, 21-16తో ఓడించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఉనతి కీలక సమయంలో రాణించి విజయం సాధించింది. ఉనతి.. తదుపరి రౌండ్లో 13వ సీడ్ కెనడా షట్లర్ మిషెల్ లీతో తలపడనుంది.తొలి రోజే సంచలనంటోర్నీ తొలి రోజే భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీపై అద్భుత విజయం సాధించి. అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా రౌండ్ ఆఫ్ 64లో సునాయాస విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది.లక్ష్యసేన్ శుభారంభంపురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ బల్గేరియాకు చెందిన కాలిన్స్ వాలెంటైన్ ఫిలిమోన్ను మూడు గేముల్లో ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 16-21, 21-8, 21-4తో ఫిలిమోన్‌పై విజయం సాధించాడు. లక్ష్యసేన్ తదుపరి రౌండ్లో అమెరికాకు చెందిన గారెట్ టాన్తో తలపడనున్నాడు. -
జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక అర్జున అవార్డుల విజేతలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ పదిహేడు మంది అథ్లెట్లు ఈ పురస్కారం గెలుచుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే, అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును మాత్రం ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. కాగా 2024లో మనూ భాకర్ (షూటింగ్), డి గుకేశ్ (చెస్), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్) ఖేల్‌రత్న అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి షూటర్ ధనుష్ శ్రీకాంత్ , షట్లర్ గాయత్రి గోపీచంద్‌ను అర్జున అవార్డు వరించింది.అర్జున అవార్డుల విజేతలు వీరేతేజస్విని శంకర్- అథ్లెటిక్స్ముహమ్మద్ అజ్మల్ వి- అథ్లెటిక్స్ప్రియాంక గోస్వామి-అథ్లెటిక్స్ట్రెసా జాలి- బ్యాడ్మింటన్గాయత్రి గోపీచంద్- బ్యాడ్మింటన్నరేంద్ర బేర్వాల్- బాక్సింగ్విదిత్ సంతోష్ గుజరాతి- చెస్దివ్య దేశ్‌ముఖ్- చెస్ధనుష్ శ్రీకాంత్- డెఫ్ షూటింగ్లాల్రేస్మియామి- హాకీరాజ్కుమార్ పాల్- హాకీసుజీత్- కబడ్డిపూజ: కబడ్డిరుద్రాంశ్ ఖండేల్వాల్- పారా షూటింగ్ఏక్తా భయాన్- పారా అథ్లెటిక్స్అర్వింద్ సింగ్- రోయింగ్అఖిల్ షియోరన్- షూటింగ్అర్జున అవార్డు (లైఫ్‌టైమ్)-2025అరుమైనాయగం- ఫుట్బాల్ద్రోణాచార్య అవార్డు 2025- రెగ్యులర్ కేటగిరిపర్వీర్ సింగ్- అథ్లెటిక్స్చోటే లాల్ యాదవ్- బాక్సింగ్నేహా నందకుమార్ చవాన్- షూటింగ్ద్రోణాచార్య అవార్డు లైఫ్‌టైమ్ కేటగిరిధర్మేంద్ర సింగ్ యాదవ్- బాక్సింగ్వీరేందర్ కుమార్- రెజ్లింగ్రాష్ట్రీయ క్రీడా ప్రోత్సాహక పురస్కార్ ఆర్మీ పారాలింపిక్ నోడ్, పూణే- స్పోర్ట్స్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ -
Swiss Open 2024: క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–10, 21–12తో భారత్‌కే చెందిన ప్రియ–శ్రుతి మిశ్రా జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 17–21, 16–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన గాయత్రి – ట్రెసా జోడీ
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 1000 టోర్నీ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ దూకుడు కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి – ట్రెసా జంట వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ద్వయం 21–14, 18–21, 21–12 స్కోరుతో లీ వెన్ మీ – ల్యూ వాన్ వాన్ (చైనా)పై విజయం సాధించింది. 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రపంచ 17వ ర్యాంక్ జోడి గాయత్రి – ట్రెసా అటు అటాకింగ్, ఇటు డిఫెన్స్‌లో చెలరేగింది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించినప్పటినుంచి వరుస విజయాలతో సత్తా చాటుతున్న భారత జంట అదే జోరును ఇక్కడా ప్రదర్శించింది. తొలి గేమ్‌ను ధాటిగా ప్రారంభించిన గాయత్రి – ట్రెసా 6–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అయితే చైనా జంట 6–6తో స్కోరును సమం చేసింది. ఈ దశలో మళ్లీ చెలరేగిన భారత జోడి ముందుగా 11–8తో ఆధిక్యం ప్రదర్శించి ఆ తర్వాత వరుస పాయింట్లతో 18–12కు దూసుకెళ్లి ఆపై గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం భారత జంటకు గట్టి పోటీ ఎదురైంది. ఏ దశలోనూ ఆధిక్యం అందుకోలేకపోయిన గాయత్రి – ట్రెసా గేమ్‌ను కోల్పోయారు. చివరి గేమ్‌లో మాత్రం మన జట్టుదే హవా నడిచింది. వరుసగా ఆరు పాయింట్లతో 8–1తో ముందంజ వేసిన అనంతరం స్కోరు 11–4..13–5..15–8..18–10...ఇలా సాగింది. 20–12 వద్ద గాయత్రి కొట్టిన ఫోర్‌హ్యాండ్ స్మాష్‌తో భారత జంట విజయం ఖాయమైంది. సెమీ ఫైనల్లో కొరియాకు చెందిన బేక్ హ నా – లీ సొ హితో గాయత్రి – ట్రెసా తలపడతారు. -
సాయిప్రణీత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో గురువారం మూడు స్వర్ణాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన జట్టుకు బాస్కెట్‌బాల్‌లో కూడా మరో బంగారు పతకం దక్కింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో తెలంగాణ షట్లర్ సాయిప్రణీత్ 21–11, 12–21, 21–16తో మిథున్ మంజునాథ్ (కర్నాటక)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల డబుల్స్‌లో ఫైనల్లో ఎన్.సిక్కిరెడ్డి–పుల్లెల గాయత్రి గోపీచంద్ ద్వయం పసిడి పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో సిక్కి–గాయత్రి 21–14, 21–11తో శిఖా గౌతమ్–అశ్విని భట్ (కర్నాటక)ను చిత్తు చేశారు. మహిళల బాస్కెట్‌బాల్ 5–5 ఈవెంట్లో కూడా తెలంగాణకు స్వర్ణం లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తెలంగాణ 67–62 పాయింట్ల తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. మూడు క్వార్టర్లు ముగిసే సరికి 5 పాయింట్లతో వెనుకబడి ఉన్న తెలంగాణ నాలుగో క్వార్టర్లో 10 పాయింట్ల ఆధిక్యం సాధించి విజయాన్నందుకోవడం విశేషం. తెలంగాణ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో రెండో స్థానంలో నిలిచిన విృత్తి రజత పతకాన్ని అందుకుంది. -
కాంస్యం నెగ్గిన గోపిచంద్ తనయ
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత షట్లర్ల హవా కొనసాగుతోంది. పురుషుల, మహిళల సింగల్స్‌లో లక్ష్యసేన్, పీవీ సింధు.. పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ ఇదివరకే ఫైనల్‌కు చేరగా.. పదో రోజు ఆఖర్లో పురుషుల సింగల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి గోపిచంద్ జోడీ కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక పోరులో ట్రీసా-గాయత్రి ద్వయం.. ఆస్ట్రేలియాకు చెందిన చెన్ సుయాన్ యు వెండి-గ్రోన్యా సోమర్విల్లే జోడీపై 21-15, 21-19 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ట్రీసా-గాయత్రి ద్వయం ఇదే ఎడిషన్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ రజతం నెగ్గిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ట్రీసా-గాయత్రి జోడీ కాంస్యంతో బ్యాడ్మింటన్‌లో భారత పతకాల సంఖ్య 3కు (రజతం, 2 కాంస్యాలు), ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 54కు చేరింది. చదవండి: కాంస్యం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య.. భారత్ ఖాతాలో 50వ పతకం -
గాయత్రి–త్రిషా జంట సంచలనం
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒత్తిడిని దరిచేరనీయకుండా సహజశైలిలో ఆడితే అద్భుతాలు చేయవచ్చని భారత బ్యాడ్మింటన్ టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ నిరూపించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో గాయత్రి–త్రిషా ద్వయం నమ్మశక్యంకానీ రీతిలో ఆడి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో వందేళ్లపైబడిన చరిత్ర కలిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా గాయత్రి–త్రిషా జంట రికార్డు నెలకొల్పింది. బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం అద్భుతం జరిగింది. మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే భారత టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ సంచలనం సృష్టించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్ ద్వయం లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఈ క్రమంలో 19 ఏళ్ల కేరళ అమ్మాయి త్రిషా జాలీ, 18 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి గాయత్రి 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న భారతీయ జంటగా రికార్డు నెలకొల్పింది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ జంటతో జరిగిన పోరులో గాయత్రి–త్రిషా అద్భుతంగా ఆడారు. తొలిసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడుతున్న గాయత్రి–త్రిషా తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్‌లో 18–20తో ఓటమి అంచుల్లో నిలిచారు. కొరియా జంట మరో పాయింట్ గెలిచిఉంటే గాయత్రి–త్రిషా ఇంటిదారి పట్టేవారే. కానీ అలా జరగలేదు. రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నప్పటికీ గాయత్రి–త్రిషా పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచారు. రెండో గేమ్‌ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో గాయత్రి–త్రిషా స్కోరు 8–8తో సమంగా ఉన్న దశలో ఒక్కసారిగా విజృంభించారు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొరియా జోడీ తేరుకునే ప్రయత్నం చేసినా గాయత్రి–త్రిషా తమ దూకుడు కొనసాగించి ప్రత్యర్థి ఆట కట్టించారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 276వ ర్యాంక్ జోడీ జెంగ్ యు–షు జియాన్ జాంగ్ (చైనా)లతో గాయత్రి–త్రిషా ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో లక్ష్య సేన్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువతార లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్‌తో తలపడాల్సిన చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు గాయం కారణంగా వైదొల గడంతో లక్ష్య సేన్‌కు వాకోవర్ లభించింది. ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. డిఫెండింగ్ చాంప్ లీ జి జియా (మలేసియా)–మాజీ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) మధ్య మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్ –కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 17–21తో ఓడింది. తొలి గేమ్‌లో భారత జంటకు ఆరు గేమ్ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. నిజానికి ఈ టోర్నీలో మాకు ఎంట్రీ లభిస్తుందని ఆశించలేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని జోడీలు వైదొలగడంతో రిజర్వ్ జాబితా నుంచి మాతోపాటు వేరే జోడీలకూ ఎంట్రీ లభించింది. ప్రతి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. క్వార్టర్ ఫైనల్లోని రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడ్డా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఆడి విజయాన్ని అందుకున్నాం. –గాయత్రి తల్లిదండ్రులకు తగ్గ తనయ గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించారు. తల్లి పీవీవీ లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. తల్లిదండ్రులు రాణించిన ఆటలోనే ఇప్పుడు కుమార్తె మెరి సింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి గాయత్రి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. -
సెమీస్‌లో గాయత్రి గోపీచంద్
రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గాయత్రి గోపీచంద్ (రంగారెడ్డి) సెమీఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి 21-7, 21-3తో తనుశ్రీ (వరంగల్)ని చిత్తుగా ఓడించింది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మేఘనా రెడ్డి (హైదరాబాద్) 21-12, 18-21తో అభిలాష (హైదరాబాద్)పై, కేయూర 21-15, 21-16తో భార్గవి (రంగారెడ్డి)పై, సామియా ఫరూఖి (రంగారెడ్డి) 21-5, 23-21తో ప్రవళిక (మెదక్)పై గెలుపొందారు. బాలుర సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో శ్రీకృష్ణ (రంగారెడ్డి) 21-10, 21-13తో మహితేజ (హైదరాబాద్)పై, పవన్ కృష్ణ (ఖమ్మం) 21-17, 21-10తో భవధీర్ (హైదరాబాద్)పై, విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) 21-17, 21-14తో రితిన్ (వరంగల్)పై విజయం సాధించారు.


