‘అర్జున’ గాయత్రి, ధనుష్‌ | Gayatri Gopichand, Dhanush Srikanth Selected for Arjuna Award | Sakshi
Sakshi News home page

‘అర్జున’ గాయత్రి, ధనుష్‌

Aug 19 2026 5:11 AM | Updated on Aug 19 2026 5:11 AM

Gayatri Gopichand, Dhanush Srikanth Selected for Arjuna Award

జాతీయ క్రీడా పురస్కారానికి ఎంపికైన

తెలంగాణ షట్లర్, షూటర్‌ ‘ఖేల్‌రత్న’ లేకుండానే అవార్డుల ప్రకటన

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డీ లేకుండానే 2025  సంవత్సరానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడా కారులకు అందించే ‘అర్జున అవార్డు’ కోసం 17 మందిని ఎంపిక చేశారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారం ఐదుగురిని వరించింది. తెలంగాణ నుంచి ఇద్దరు ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ లభించింది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ పుల్లెల గాయత్రి... బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ ‘అర్జున అవార్డు’ అందుకోనున్నారు. ప్రపంచకప్‌ చెస్‌ విజేత దివ్య దేశ్‌ముఖ్, కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో రెండు వేర్వేరు ఈవెంట్స్‌లో పతకాలు గెలిచిన అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ కూడా ‘అర్జున’ జాబితాలో ఉన్నారు.  

గాయత్రి 2015లో ఆసియా అండర్‌–15 చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కేరళకు చెందిన ట్రెసా జాలీతో జతగా బ్యాడ్మింటన్‌లోని అన్ని ప్రముఖ టోర్నిల్లో పాల్గొన్న గాయత్రి తన కెరీర్‌లో మొత్తం ఐదు డబుల్స్‌ అంతర్జాతీయ టైటిల్స్‌ను సాధించింది. గాయత్రితోపాటు ట్రెసా జాలీకి కూడా అర్జున అవార్డు లభించింది.  హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల ధనుష్‌ శ్రీకాంత్‌ రెండు వరుస (2022, 2025) బధిర ఒలింపిక్స్‌ క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్స్‌లో «పసిడి పతకాలు గెలిచాడు. 

జూనియర్‌ ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్‌లో, జూనియర్‌ ప్రపంచకప్‌లో నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నాడు.  సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి అరుణ్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలో భారత ఒలింపిక్‌ సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ షూటర్‌ గగన్‌ నారంగ్, బ్యాడ్మింటన్‌ మాజీ ప్లేయర్‌ అపర్ణ పోపట్, మాజీ హాకీ ప్లేయర్‌ సోమయ్య సభ్యులుగా ఉన్న సెలెక్షన్‌ కమిటీ ‘అర్జున అవార్డు’ కోసం 24 మంది పేర్లను సిఫారసు చేయగా... కేంద్ర క్రీడా శాఖ 17 మంది పేర్లను ఆమోదించింది. 2014 తర్వాత ‘ఖేల్‌ రత్న’  ఎవరికీ లభించకపోవడం ఇదే తొలిసారి.

జాతీయ క్రీడా అవార్డీల వివరాలు
అర్జున అవార్డు (రెగ్యులర్‌): తేజస్విన్‌ శంకర్, అజ్మల్, ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్‌), పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ (బ్యాడ్మింటన్‌), నరేందర్‌ (బాక్సింగ్‌), దివ్య దేశ్‌ముఖ్, విదిత్‌ (చెస్‌), ధనుష్‌ శ్రీకాంత్‌ (డెఫ్‌ షూటింగ్‌), రుద్రాంశ్‌ ఖండేల్‌వాల్‌ (పారా షూటింగ్‌), అఖిల్‌ షెరోన్‌ (షూటింగ్‌), లాల్‌రెమ్‌సియామి, రాజ్‌కుమార్‌ పాల్‌ (హాకీ), సుర్జీత్, పూజ (కబడ్డీ), ఏక్తా భ్యాన్‌ (పారా అథ్లెటిక్స్‌), అరవింద్‌ సింగ్‌ (రోయింగ్‌). లైఫ్‌టైమ్‌: అరుమైనయాగం (ఫుట్‌బాల్‌). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్‌): పరీ్వర్‌ సింగ్‌ (అథ్లెటిక్స్‌), చోటేలాల్‌ యాదవ్‌ (బాక్సింగ్‌), నేహా (షూటింగ్‌). లైఫ్‌టైమ్‌: ధర్మేంద్ర సింగ్‌ యాదవ్‌ (బాక్సింగ్‌), వీరేంద్ర కుమార్‌ (రెజ్లింగ్‌). రా్రïÙ్టయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌: ఆర్మీ పారాలింపిక్‌ నోడ్‌ (పుణే). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement