అత్యంత అరుదైన ఘనత సాధించిన ఇషాన్‌ కిషన్‌ | Ishan Kishan Slams 1000 T20I Runs In A Calendar Year, Becomes Only Second Indian To Do So | Sakshi
Sakshi News home page

అత్యంత అరుదైన ఘనత సాధించిన ఇషాన్‌ కిషన్‌

Oct 3 2026 12:37 PM | Updated on Oct 3 2026 12:47 PM

Ishan Kishan Slams 1000 T20I Runs In A Calendar Year, Becomes Only Second Indian To Do So

source: X

పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ టీ20 అంతర్జాతీయాల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2026లో ఇషాన్‌ ఈ ఘనత సాధించాడు. ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

గతంలో భారత్‌ తరఫున మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2022లో స్కై 31 ఇన్నింగ్స్‌ల్లో 1164 పరుగులు చేయగా.. ఇషాన్‌ ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 29 ఇన్నింగ్స్‌ల్లో 1005 పరుగులు చేశాడు.

ఓవరాల్‌గా టీ20ల్లో ఇప్పటివరకు ఏడుగురు మాత్రమే ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేశారు. వీరిలో ఆస్ట్రియాకు చెందిన కరణ్‌బీర్‌ సింగ్‌ అత్యధికంగా 32 ఇన్నింగ్స్‌ల్లో 1488 పరుగులు చేశాడు. పాక్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (1326) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 

ఈ జాబితాలో స్కై నాలుగో స్థానంలో ఉండగా.. ఇషాన్‌ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇంకా సమయం మిగిలి ఉండటంతో ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ టాప్‌ ప్లేస్‌కు చేరవచ్చు.

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ తరఫున అత్యధిక టీ20I పరుగులు
1164 – సూర్యకుమార్‌ యాదవ్‌ (2022)
1005 – ఇషాన్‌ కిషన్‌ (2026)
859 – అభిషేక్‌ శర్మ (2025)
811 – అభిషేక్‌ శర్మ (2026)
781 – విరాట్‌ కోహ్లీ (2022)

భారత్‌-పాకిస్తాన్‌ ఏషియన్‌ గేమ్స్‌ 2026 ఫైనల్స్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 61 పరుగులు) ఆరంభంలో చెలరేగిపోగా.. ఆఖర్లో తిలక్‌ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించాడు.

అనంతరం ఛేదన ప్రారంభించిన పాకిస్తాన్‌ వికెట్లు కోల్పోవమే కాకుండా నిదానంగా ఆడుతూ ఓటమి దిశగా పయనిస్తుంది. 8 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 52-3గా ఉంది. హసన్‌ నవాజ్‌ (4), సైమ్‌ అయూబ్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలవాలంటే 72 బంతుల్లో 160 పరుగులు చేయాలి. ఇది అంత ఈజీగా జరిగే పని కాదు.

ఇదీ చదవండి: Asian Games Finals: వైభవ్‌కు ఎగతాళి చేసిన పాక్‌ బౌలర్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement