Asian Games Finals: వైభవ్‌కు ఎగతాళి చేసిన పాక్‌ బౌలర్‌ | Asian Games Finals, IND VS PAK: Saim Ayub Mocks Vaibhav Sooryavanshi With Babysitting Gesture | Sakshi
Sakshi News home page

Asian Games Finals: వైభవ్‌కు ఎగతాళి చేసిన పాక్‌ బౌలర్‌

Oct 3 2026 11:03 AM | Updated on Oct 3 2026 11:09 AM

Asian Games Finals, IND VS PAK: Saim Ayub Mocks Vaibhav Sooryavanshi With Babysitting Gesture

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఇవాళ జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌ ఫైనల్స్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీని (15) ఔట్‌ చేసిన తర్వాత పాక్‌ బౌలర్‌ సైమ్‌ అయూబ్‌ ఓవరాక్షన్‌ చేశాడు. బేబీ సిట్టింగ్‌ గెశ్చర్‌తో వైభవ్‌ను ఆటపట్టించాడు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించిన వైభవ్‌ సహచరుడు అభిషేక్‌ సైమ్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. వైభవ్‌ను ఔట్‌ చేసిన ఓవర్‌లోనే సిక్సర్‌, వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఈ తంతు ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో జరిగింది. 

సైమ్‌ అప్పటికే వరుసగా రెండు సిక్సర్లు బాదిన వైభవ్‌ను తొలి బంతికే బోల్తా కొట్టించాడు. వైభవ్‌ అనవసరమైన రివర్స్‌ స్వీప్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. దీనిపై అభిషేక్‌ కూడా అసహనం వ్యక్తం చేశాడు.

వైభవ్‌ ఔటైన తర్వాత గేర్‌ మార్చిన అభిషేక్‌ 20 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేశాడు. ఈ మధ్యలో సంజూ శాంసన్‌ (2) ఔటయ్యాడు. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి అరాఫత్‌ మిన్హాస్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. 

11 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 120-3గా ఉంది. ఇషాన్‌ కిషన్‌ (17), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు.  ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఇదీ చదవండి: Asian Games Finals, IND VS PAK: అభిషేక్‌ శర్మ విధ్వంసం


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement