source: X
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ మరో చారిత్రాత్మక స్వర్ణం సాధించింది. మహిళల వ్యక్తిగత గోల్ఫ్ విభాగంలో ప్రణవి ఉర్స్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఫైనల్ రౌండ్‌లో ప్రణవి అద్భుతంగా ఆడి, చైనా గోల్ఫర్ యిన్ రుయోనింగ్, సింగపూర్‌కు చెందిన షానన్ టాన్‌పై పైచేయి సాధించింది. ప్రణవి దెబ్బకు రుయోనింగ్, షానన్ టాన్ సంయుక్తంగా రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.
టీమ్ ఈవెంట్‌లోనూ రజతం
వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన ప్రణవి ఉర్స్, టీమ్ ఈవెంట్‌లోనూ (అదితి అశోక్, దీక్షా దాగర్‌తో కలిసి) భారత్‌కు రజత పతకం అందించింది.
ఇవాళ రెండో గోల్డ్
ఇవాళ భారత్ ఇప్పటికే రెండు స్వర్ణ పతకాలు ఖాతాలో వేసుకుంది. ఉదయమే మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీలో కుమ్కుమ్ మోహోద్ స్వర్ణం గెలిచింది. తాజాగా ప్రణవి గోల్డ్‌తో మెరిసింది. ఈ రెంటితో ప్రస్తుతం భారత్ ఖాతాలో 18 స్వర్ణాలు ఉన్నాయి. మొత్తంగా 79 (18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్యాలు) పతకాలు. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 318 పతకాలతో చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది.
ఇవాళ భారత్ మరిన్ని స్వర్ణ పతకాలు సాధించే అవకాశం ఉంది. పురుషుల క్రికెట్, హాకీలో భారత్ పసిడి పోరులో పాల్గొంటుంది.
ఇదీ చదవండి: భారత క్రికెట్ చరిత్రలో ఇవాళ అత్యంత అరుదైన ఘటన


