source: X
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీలో కుమ్కుమ్ మోహోద్ స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల చరిత్రలో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. అలాగే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్‌కు వ్యక్తిగత కోటా స్థానాన్ని కూడా ఖాయం చేసింది.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో కుమ్కుమ్ దక్షిణ కొరియాకు చెందిన ఓ యెజిన్‌పై 6-5తో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది 17వ స్వర్ణం. మొత్తంగా 77వది (17 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలు). ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 317 పతకాలతో చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది.
ఇవాళ భారత్ మరిన్ని స్వర్ణ పతకాలు సాధించే అవకాశం ఉంది. గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్ స్వర్ణం కోసం పోటీపడుతుండగా, పురుషుల క్రికెట్, హాకీలోనూ భారత్ పసిడి పోరులో పాల్గొంటుంది.
ఇదీ చదవండి: స్వర్ణాల ‘సిక్సర్’


