Asian Games: అచ్చొచ్చిన శుక్రవారం.. ఒకేరోజు ఆరు స్వర్ణాలు | India Secure-6-Gold Medals Single Day-Joint-Best-Match-2023 Asian Games | Sakshi
Sakshi News home page

Asian Games: అచ్చొచ్చిన శుక్రవారం.. ఒకేరోజు ఆరు స్వర్ణాలు

Oct 2 2026 8:57 PM | Updated on Oct 2 2026 9:04 PM

India Secure-6-Gold Medals Single Day-Joint-Best-Match-2023 Asian Games

భార‌త పురాణాల్లో బంగారాన్ని ల‌క్ష్మీదేవీతో పోల్చ‌డం ఆన‌వాయితీ. అలాంటిది మ‌హాల‌క్ష్మీకి ఇష్ట‌మైన శుక్ర‌వారం రోజున ఆసియా గేమ్స్‌లో భార‌త అథ్లెట్లు ప‌త‌కాల మోత మోగించారు. ఈసారి క్రీడ‌లు ప్రారంభ‌మైన మొద‌టి రోజు నుంచి చూసుకుంటే శుక్ర‌వారం వ‌చ్చిన‌న్ని ప‌త‌కాలు ఏరోజు రాలేదు. అందునా 13వ రోజైన నేడు భార‌త్ ఖాతాలో 10 ప‌త‌కాలు వ‌చ్చి చేరితే.. అందులో ఆరు స్వ‌ర్ణాలు ఉండ‌డం విశేషం. 

శుక్ర‌వారం ఒక్కోరోజే ఇన్ని స్వ‌ర్ణాలు రావ‌డంతో భార‌త చిత్ర‌ప‌టం బంగారు వ‌ర్ణంతో మెరిసిపోయింది. దేశ చిత్ర‌ప‌టంలోని చాలా రాష్ట్రాల నుంచి అథ్లెట్లు ఇవాళ ప‌త‌కాలు తీసుకురావ‌డం మ‌రో విశేషం. ఇక శుక్ర‌వారం భార‌త్‌కు వ‌చ్చిన 10ప‌త‌కాల్లో.. ఆరు స్వ‌ర్ణాలు, రెండు ర‌జ‌తాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. 

ఇందులో ఆర్చ‌రీలో మ‌హిళ‌ల రిక‌ర్వ్ టీమ్ 5-3తో సౌత్ కొరియాను ఓడించి స్వ‌ర్ణం గెలుచుకోగా, 44 ఏళ్ల త‌ర్వాత మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు 1-0తో చైనాను మ‌ట్టిక‌రిపించి ప‌సిడి ప‌త‌కం తీసుకొచ్చింది. ఇక బాక్సింగ్‌లో ల‌వ్లీనా, ప‌ర్వీన్ హుడా, అంకుశ్ పంఘ‌ల్‌లు స్వ‌ర్ణాల‌తో మెర‌వగా, రెజ్లింగ్‌లో సుజీత్ క‌ల్క‌ల్ త‌న ఉడుం ప‌ట్టుతో ప‌సిడి ప‌త‌కం గెలిచాడు. 

వీరితో పాటు ఆర్చ‌రీలో రిక‌ర్వ్ మిక్స్‌డ్ టీంతో పాటు పురుషుల రిక‌ర్వ్ టీమ్ ర‌జ‌తాల‌తో మెర‌వ‌గా, సెయిలింగ్‌లో నేత్ర కుమార‌న్, సెప‌క‌ట్‌టక్రాలో మెన్స్ క్వాండ్రాంట్ టీమ్ కాంస్యాలు సాధించాయి. దీంతో భార‌త్ ఖాతాలో ప్ర‌స్తుతం 76 ప‌త‌కాలు ఉండ‌గా.. ఇందులో 16 స్వ‌ర్ణాలు, 25 ర‌జ‌తాలు, 35 కాంస్యాలున్నాయి. ప‌త‌కాల ప‌ట్టిక‌లో టాప్‌-5లో కొన‌సాగుతోంది.

ఒకేరోజు ఆరు స్వ‌ర్ణాలు సాధించ‌డం ద్వారా మ‌న అథ్లెట్లు ఒక‌ రికార్డును కూడా న‌మోదు చేశారు. అదేంటంటే.. 2023 ఆసియా క్రీడ‌ల్లోనూ ఒకేరోజు ఆరు స్వ‌ర్ణాలు రావ‌డం విశేషం. ఆనాడు అక్టోబ‌ర్ 7న‌.. ఆర్చ‌రీ కాంపౌండ్ మ‌హిళ‌ల జ‌ట్టు, ఆర్చ‌రీ కాంపౌండ్ మ‌హిళ‌ల, పురుషుల‌ వ్య‌క్తిగ‌త విభాగాలు, బ్యాడ్మింట‌న్ పురుషుల డ‌బుల్స్‌, క‌బ‌డ్డీ పురుషుల జ‌ట్టు, క్రికెట్ పురుషుల జ‌ట్లు స్వ‌ర్ణాల‌తో మెరిశాయి.

ఇక శ‌నివారం ఆసియా క్రీడ‌ల‌కు చివ‌రి రోజు పురుషుల హాకీ జ‌ట్టు ఫైన‌ల్ (భార‌త్ వ‌ర్సెస్ మ‌లేషియా)తో పాటు, క్రికెట్ ఫైన‌ల్ (భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్‌) స‌హా మిగతా ఈవెంట్లు ఉండ‌డంతో భార‌త్ 80 ప‌త‌కాల మార్క్ అందుకుంటుందా అన్న‌ది చూడాలి.

ఇదీ చదవండి: 44 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. భారత మ‌హిళ‌ల హాకీ జ‌ట్టుకు స్వ‌ర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement