‘క్లీన్‌ స్వీప్‌’ లక్ష్యంగా... | Indias third ODI against West Indies today | Sakshi
Sakshi News home page

‘క్లీన్‌ స్వీప్‌’ లక్ష్యంగా...

Oct 3 2026 4:06 AM | Updated on Oct 3 2026 4:06 AM

Indias third ODI against West Indies today

నేడు వెస్టిండీస్‌తో భారత్‌ మూడో వన్డే

మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

న్యూచండీగఢ్‌: టాపార్డర్‌ విజృంభించడంతో వెస్టిండీస్‌పై వరుసగా రెండు వన్డేల్లో విజయాలు సాధించిన భారత జట్టు ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో చివరి వన్డే ఆడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాలను అలవోకగా ఛేదించిన టీమిండియా... ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ను మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. 

గువాహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో గిల్‌ బృందం 406 పరుగుల రికార్డు లక్ష్యాన్ని కేవలం 43.3 ఓవర్లలోనే పూర్తి చేసి ఔరా అనిపించింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించిన మాట వాస్తవమే అయినా... ఛేదనలో అంత పెద్ద లక్ష్యాన్ని మరో 39 బంతులు మిగిలుండగానే పూర్తిచేసిన భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో... మరో ఏడాది మాత్రమే ఉన్న మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలని భావిస్తోంది. 

టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చే ఆలోచనలైతే లేవు. దీంతో మరోసారి యశస్వి జైస్వాల్‌ బెంచ్‌కే పరిమితం కావొచ్చు. గాయంతో జట్టుకు దూరమైన ప్రసిధ్‌ స్థానంలో సిరాజ్‌కు చోటు దక్కడం ఖాయమే. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చినప్పటికీ జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీకి మరో అవకాశం దక్కొచ్చు. మరోవైపు వెస్టిండీస్‌ జట్టు తమ వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసినా... టీమిండియా దూకుడు ముందు నిలవలేకపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement