Photo Credit: Twitter
పాకిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శుక్రవారం లంక క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయంతో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ కుశాల్ మెండిస్ తిరిగి రాగా.. మాజీ కెప్టెన్ దాసున్ షనక చోటు దక్కించు కున్నాడు. ఇటీవలే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బౌలర్లను ఊచకోత కోసిన షనకతో పాటు కుశాల్ రాక లంక జట్టును బలోపేతం చేసింది.
ఇక ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న చరిత అసలంకతో పాటు బౌలర్ దిల్షాన్ మధుశంక, తరిందు రత్నాయకే, ఆల్‌రౌండర్ జనిత్ లియానగేలకు ఉద్వాసన పలికింది. ఇక దుష్మంత చమీర ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. గాయంతో సిరీస్‌కు దూరమైన వనిందు హసరంగ స్థానంలో స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్ జట్టులోకి తీసుకుంది.
సినెత్ జయవర్ధనను కూడా బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేసింది. అక్టోబర్ 9 నుంచి 13 వరకు ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లకు రావల్పిండి వేదిక కానుంది.
టీ20 సిరీస్‌కు లంక జట్టు:
కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిల్ మిశ్ర, సినెత్ జయవర్ధన, లాహిరు ఉదర, సహన్ అరాచిగే, కమిందు మెండిస్, దాసున్ షనక, చమిందు విక్రమసింఘే, దునిత్ వెల్లాలగే, మహీశ్ తీక్షణ, విజయకాంత్ వియస్కాంత్, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ఈషాన్ మలింగ, దుష్మంత చమీర (ఫిట్‌నెస్ ఆధారంగా).
ఇదీ చదవండి: Asian Games: అచ్చొచ్చిన శుక్రవారం.. ఒకేరోజు ఆరు స్వర్ణాలు


