breaking news
Squad Team
-
కోహ్లి, శ్రేయస్ అవుట్ రాహుల్, జడేజా డౌట్
-
డిష్యూం.. డిష్యూం!
పిడిగుద్దుల మోత మోగింది.. రాళ్లవర్షం కురిసింది.. అరుపులు కేకలతో దద్దరిల్లింది.. చీపుర్లు, చెప్పులు గాల్లో ఎగిరాయి.. పత్తి జిన్నింగ్ మిల్లుల తనిఖీ కోసం వచ్చిన అధికారులకు ఏం జరుగుతుందో తెలియక చెమటలు పట్టాయి. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.. వెరసి గద్వాల రమ్య జిన్నింగ్ మిల్లు వద్ద జరిగిన ఘర్షణ సినిమా సీన్‌ను తలపించింది. గద్వాల/టౌన్/న్యూటౌన్: పర్యావరణ శాఖ అధికారులు మంగళవారం చేపట్టిన పత్తి మిల్లుల తనిఖీ రసాబాసగా మారింది. కాంగ్రెస్, మిల్లు యాజమాన్యం దాడులకు పూనుకుంది. పత్తి డీలింటింగ్ (పత్తి నుంచి గింజలను వేరుచేసే ప్రక్రియ)లో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మోతాదుకు మించి వాడుతున్నారన్న ఫిర్యాదుమేరకు పర్యావరణ శాఖ అధికారుల బృందం గద్వాల పట్టణంలోని రమ్య జిన్నింగ్ మిల్లును తనిఖీ చేసేందుకు వచ్చింది. కాగా, వారి వెంట వచ్చిన గద్వాల మునిసిపల్ చైర్పర్సన్ బృందాన్ని మిల్లు యాజమాన్యం, కార్మికులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో వైస్ చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు గాయపడ్డారు. అలాగే ఇరువర్గాల జరిగిన రాళ్లదాడిలో గద్వాల డీఎస్పీ బాలకోటి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఏం జరిగిందంటే.. గద్వాల పట్టణం చుట్టూ సీడ్ విత్తనోత్పత్తిలో భాగమైన జిన్నింగ్, డీలింటింగ్ పద్ధతులను పాటించేందుకు 18కి పైగా ఫ్యాక్టరీలు వెలిశాయి. ఇందుకోసం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎక్కువ మొత్తంలో వాడుతున్నందున తాగునీరు కలుషితం కావడంతో పాటు భూమి దెబ్బతింటుందని మునిపిపల్ చైర్పర్సన్ పద్మావతితో పాటు నడిగడ్డ పరిరక్షణ సమితి నాయకులు గతంలో పర్యావరణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు ఇంతకుముందే పలుమార్లు తనిఖీలు చేపట్టారు. మరోసారి ఫిర్యాదులు అందడంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి పర్యావరణ స్క్వాడ్ బృందం స్థానిక రమ్య జిన్నింగ్ మిల్లుకు చేరుకుంది. వారి వెంట మునిసిపిల్ చైర్పర్సన్ బండాల పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. ఫ్యాక్టరీలోకి ఎవరు రానిచ్చారు, ఎలా వచ్చారని వారిని ఫ్యాక్టరీ యజమానులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసుల ఎదుటే ఇరువర్గాల మధ్య తిట్ల పురాణం మొదలైంది. ఈ తరుణంలో అధికారులు తనిఖీ చేస్తారని, బయటికి వెళ్లాలని చైర్పర్సన్ బృందాన్ని ఎస్ఐ సైదాబాబు కోరారు. తనిఖీ జరిగే వరకు ఇక్కడే ఉంటామని ఫ్లాట్‌పాంపై బైఠాయించారు. అయినప్పటికీ రెండువర్గాల మధ్య వాదోపవాదాలు పెరగడంతో ఘర్షణ వాతావరణంలో రెండువైపులా చీపుర్లు, చెప్పులు విసురుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. మునిసిపల్ చైర్పర్సన్ తదితరులను బయటకు తీసుకొస్తుండగా డీఎస్పీ బాలకోటి, సీఐ సురేష్ అక్కడికి చేరుకున్నారు. ఇంతలో మళ్లీ రెండువైపులా రాళ్లవర్షం ప్రారంభమైంది. దీంతో పోలీసులు చైరపర్సన్ బృందాన్ని వాహనాల్లో అక్కడినుంచి తరలించారు. పలువురికి గాయాలు జిన్నింగ్ మిల్లు వద్ద జరిగిన రాళ్లదాడిలో మునిసిపల్ వైస్‌చైర్మన్ శంకర్‌తో పాటు కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, చందు, తుమ్మల నర్సింహులు, నాయకులు బండల వెంకట్రాములు, కొత్త గణేష్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. చైర్మన్, వైస్ చైర్మన్ బృందం డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని అక్కడే బైఠాయించింది. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులతో కలిసి మిల్లును పరిశీలించేందుకు తమను రానివ్వకుండా దాడులు చేసి గాయపర్చడాన్ని నిరసిస్తూ బుధవారం పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మునిసిపల్ చైర్పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్ తెలిపారు. -
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, సంస్కృతం, హిం దీ, ఉర్దూ, అరబిక్ సబ్జెక్టు పరీక్షలు జరి గాయి. జిల్లావ్యాప్తంగా 133 పరీక్ష కేం ద్రాలు ఏర్పాటుచేయగా, జనరల్ విభాగంలో 48,392 మందికి 43,683 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్య ఆర్ఐఓ మల్హల్రావు తెలిపారు. కాగా, గోవిందరావుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో కాపీ చేస్తున్న ఆరుగురు విద్యార్థులను స్క్వాడ్ బృందం డిబార్ చేసింది. కేంద్రాల వద్ద ముందస్తు సందడి ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 8-30గంటల వరకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్య మైనా అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో అన్ని కేంద్రాల వద్ద ముం దుగానే సందడి నెలకొంది. ఎక్కువశా తం మంది విద్యార్థులు నిర్ణీత సమయానికి చేరుకున్నా అక్కడక్కడా ఆలస్యమై న విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉద యం 8-45గంటల తర్వాత జిల్లాలో 30 మంది విద్యార్థులు రాగా, వారి పేర్లను నమోదు చేశారు. ఇంకా మహబూబాబాద్‌లోని ఓ కేంద్రంలో ఐదుగురు విద్యార్థులు ఉదయం 9-05 గంట లకు రావడంతో, వివరణ తీసుకున్న అధికారులు ఇదే చివరిసారిగా పేర్కొంటూ అనుమతించారు. కాగా, జిల్లాలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ సౌకర్యం లేక కింద కూర్చుని పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువా రం ప్రారంభం కానున్నాయి.