Photo Credit: Twitter
గౌహతి వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఇరుజట్ల బ్యాటర్లు రికార్డులను ఊచకోత కోశారు. కేవలం రికార్డుల కోసమే ఆడుతున్నారా అనేంతలా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత భారత బౌలర్లను విండీస్ చితక్కొట్టింది. ఆకాశమే హద్దుగా చెలరేగి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.
ఈ క్రమంలో ఆ జట్టు నుంచి ముగ్గురు బ్యాటర్లు.. క్యాంప్‌బెల్, షెయ్ హోప్, అమీర్ జంగాలు శతకాలతో చెలరేగారు. అసలే సొంతగడ్డపై ఆడుతున్న టీమిండియా.. భారీ లక్ష్య ఛేదన కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ, విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ క్రమంలో ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. అయితే గిల్ ఒక అడుగు ముందుకేసి తన సెంచరీని కాస్త డబుల్ సెంచరీగా మలిచాడు.
ఈ నేపథ్యంలోనే వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఒకే వన్డే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. టెస్టుల్లో ఇలాంటి ఫీట్లు సర్వ సాధారణం. అయితే అంతర్జాతీయంగా వన్డేల్లో మాత్రం ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా లిస్ట్-ఎ క్రికెట్‌లో మాత్రం రెండోసారి. తొలిసారి 2025లో రాజ్‌కోట్ వేదికగా బరోడా, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు శతకాలతో మెరిశారు.
ఇదీ చదవండి: గిల్ డబుల్ సెంచరీ, రోహిత్ సెంచరీ.. టీమిండియా రికార్డు ఛేదన


