Photo Credit: BCCI Twitter
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (133 బంతుల్లో 223 నాటౌట్, 26 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీకి తోడు రోహిత్ శర్మ (101) సెంచరీ చేయడంతో విండీస్ విధించిన 406 పరుగుల భారీ టార్గెట్‌ను 43.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. కోహ్లి (29), రుతురాజ్ గైక్వాడ్ (31 నాటౌట్) తమ వంతు పాత్ర పోషించారు. వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్, షమర్ జోసెఫ్ చెరొక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అమిర్ జాంగో (77 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), జాన్ క్యాంప్‌బెల్ (68 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ షెయ్ హోప్ (94 బంతుల్లో 104; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత శతకాలు సాధించి భారీ స్కోరుకు బాటలు వేశారు.
చివర్లో రోస్టన్ చేజ్ (25 బంతుల్లో 29 నాటౌట్) ధాటిగా ఆడడంతో వెస్టిండీస్ 400 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో అందరూ దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక టీమిండియా వరుసగా రెండో వన్డేలోనూ విజయం సాధించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. అజేయ డబుల్‌సెంచరీతో జట్టును గెలిపించిన కెప్టెన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరి వన్డే శనివారం ఛండీగర్ వేదికగా జరగనుంది.
A night for the 𝗵𝗶𝘀𝘁𝗼𝗿𝘆 𝗯𝗼𝗼𝗸𝘀 📚✨#TeamIndia register their highest successful ODI run chase to take an unassailable 2️⃣-0️⃣ lead in the series 👏👏
Scorecard ▶️ https://t.co/6XCYRtZLAi#INDvWI | @mflone_ pic.twitter.com/wiEGxX2pCt— BCCI (@BCCI) September 30, 2026
ఇదీ చదవండి: గిల్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ


