వన్డే చరిత్రలో తొలి బ్యాటర్‌గా.. అంద‌నంత ఎత్తులో రోహిత్ శ‌ర్మ‌ | Rohit Sharma 1st-Batter-Smash 200 ODI Sixes Single Country Vs WI 2nd-ODI | Sakshi
Sakshi News home page

వన్డే చరిత్రలో తొలి బ్యాటర్‌గా.. అంద‌నంత ఎత్తులో రోహిత్ శ‌ర్మ‌

Sep 30 2026 9:11 PM | Updated on Sep 30 2026 9:13 PM

Rohit Sharma 1st-Batter-Smash 200 ODI Sixes Single Country Vs WI 2nd-ODI

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ వ‌న్డే క్రికెట్‌లో మ‌రో అరుదైన ఫీట్ సాధించాడు. స్వ‌దేశంలో వ‌న్డే క్రికెట్‌లో 200 సిక్స‌ర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డుల‌కెక్కాడు. రెండో స్థానంలో క్రిస్ గేల్ (147 సిక్స‌ర్లు) కొన‌సాగుతున్నాడు. మూడో స్థానంలో మార్టిన్ గుప్టిల్ (132 సిక్స‌ర్లు), బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ (126 సిక్స‌ర్లు), ఎంఎస్ ధోని (123 సిక్స‌ర్లు) వ‌రుస‌గా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. 

పైన చెప్పుకున్న క్రికెట‌ర్ల‌లో రోహిత్ మిన‌హా మిగ‌తావారంతా ఎప్పుడో రిటైర్ అయ్యారు. దీంతో రోహిత్ 200 సిక్సర్ల రికార్డుతో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. ఓవ‌రాల్‌గా చూసుకున్నా రోహిత్ శ‌ర్మ వ‌న్డేల్లో 376 సిక్స‌ర్లతో తొలి స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక  మ్యాచ్‌ విషయానికొస్తే.. ముగ్గురు బ్యాట‌ర్లు సెంచ‌రీల‌తో విరుచుకుప‌డ‌డంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 405 ప‌రుగులు చేసింది. 

అమిర్ జాంగో (77 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్స‌ర్లు),  జాన్ క్యాంప్‌బెల్ (68 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), కెప్టెన్ షెయ్ హోప్ (94 బంతుల్లో 104; 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) వీరోచిత శ‌త‌కాలు సాధించి భారీ స్కోరుకు బాట‌లు వేశారు. ప్ర‌తిగా భార‌త్ కూడా ధీటుగా స్పందిస్తోంది. ప్ర‌స్తుతం 28 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. గిల్ (164), కోహ్లి (2) క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు రోహిత్ శ‌ర్మ (101) సెంచ‌రీ చేసి ఔట‌య్యాడు.

ఇదీ చదవండి: విండీస్‌తో రెండో వన్డే.. చరిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement