PC: BCCI/X
గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. తొలి వన్డేలో విఫలమైనప్పటికి.. ఈ మ్యాచ్‌లో మాత్రం కరేబియన్ బౌలర్లను హిట్‌మ్యాన్ ఉతికారేశాడు. 406 పరుగుల భారీ లక్ష్యం చేధనలో రోహిత్ తన విశ్వరూపించాడు.
ఈ క్రమంలో రోహిత్ కేవలం 72 బంతుల్లోనే తన 35వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 75 బంతులు ఎదుర్కొన్న ముంబైకర్.. 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. లక్ష్య చేధనలో ఓపెనింగ్ వికెట్‌కు శుబ్‌మన్ గిల్‌తో కలిసి 255 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కాగా ఇదే మ్యాచ్‌లో 12,000 పరుగుల మైలు రాయిని కూడా రోహిత్ అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.
చదవండి: Shubman Gill: ఫాస్టెస్ట్ సెంచరీ.. సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్


