Photo Credit: BCCI Twitter
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన అకీబ్ నబీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అకీబ్ నబీ రికార్డులకెక్కాడు. 1975లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో కర్సన్ గార్వి 11 ఓవర్లు వేసి 83 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా అకీబ్ నబీ 51 ఏళ్ల తర్వాత ఆ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
గుర్నూర్ బ్రార్ చెత్త రికార్డు
టీమిండియా బౌలర్ గుర్నూర్ బ్రార్ చెత్త రికార్డు నమోదు చేశాడు. మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ వేసిన గుర్నూర్ బ్రార్ 96 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టుకు అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్ల జాబితాలో గుర్నూర్ చోటు దక్కించుకున్నాడు.
ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (106 పరుగులు వర్సెస్ సౌతాఫ్రికా, 2015లో), వినయ్ కుమార్ (102 పరుగులు వర్సెస్ ఆస్ట్రేలియా, 2013లో), గుర్నూర్ బ్రార్ (97 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్, 2026), గుర్నూర్ బ్రార్ (96 పరుగులు వర్సెస్ వెస్టిండీస్, 2026), భువనేశ్వర్ కుమార్ (92 పరుగులు వర్సెస్ న్యూజిలాండ్, 2017) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. మరో విశేషమేమిటంటే.. గుర్నూర్ బ్రార్ ఏడాదిలో రెండుసార్లు ప్రత్యర్థి జట్టుకు అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త బౌలర్‌గా నిలిచాడు.
ఇదీ చదవండి: వన్డే క్రికెట్‌లో కుల్దీప్ యాదవ్ అరుదైన ఫీట్


