IND vs AUS: చెలరేగిన ఆసీస్‌ బౌలర్లు.. కష్టాల్లో భారత్‌ | IND A vs AUS A 2nd Unofficial Test Day 2: India 122 per 5 Trial By 236 Runs | Sakshi
Sakshi News home page

IND vs AUS: చెలరేగిన ఆసీస్‌ బౌలర్లు.. కష్టాల్లో భారత్‌

Sep 30 2026 5:37 PM | Updated on Sep 30 2026 6:01 PM

IND A vs AUS A 2nd Unofficial Test Day 2: India 122 per 5 Trial By 236 Runs

పడిక్కల్‌ (PC: CApondicherry X)

ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్‌- ‘ఎ’ జట్టు కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఆయుశ్‌ పాండే (4), సాయి సుదర్శన్‌ (8) పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (31) కూడా నిరాశపరిచాడు.

కాగా పుదుచ్చేరి వేదికగా భారత్‌- ఆసీస్‌ జట్ల మధ్య మంగళవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన కంగారూ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాపార్డర్‌ విఫలమైనప్పటికీ.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సామ్‌ హార్పర్‌ అద్భుత ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధించింది.

ఆసీస్‌ మెరుగైన స్కోరు
ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్పర్‌ మొత్తంగా 223 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 128 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో నాథన్‌ మెక్‌స్వీనీ (34), జేసన్‌ సంఘా (46), లియామ్‌ స్కాట్‌ (34), టాడ్‌ మర్ఫీ (33), జై రిచర్డ్‌సన్‌ (31) ఓ మోస్తరుగా రాణించారు.

ఫలితంగా బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అనంతర బ్యాటింగ్‌కు మొదలుపెట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. రిచరర్డ్‌సన్‌ ఆయుశ్‌ను అవుట్‌ చేయగా.. సాయి సుదర్శన్‌ను మర్ఫీ బౌల్డ్‌ చేశాడు. ఇక పడిక్కల్‌ను కోరే రొచిసియోలి పెవిలియన్‌కు పంపాడు.

అజేయంగా రషీద్‌
యశ్‌ రాథోడ్‌ (15)ను మర్ఫీ వెనక్కి పంగా.. ఫామ్‌లో ఉన్న కుమార్‌ కుశాగ్రా (10)ను లియామ్‌ స్కాట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక బుధవారం ఆట పూర్తయ్యేసరికి గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ 36, తనుశ్‌ కొటియాన్‌ 6 పరుగులతో క్రీజులో నిలిచారు. 

ఈ క్రమంలో భారత్‌ రెండో రోజు ఆట ముగిసే సరికి 51 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్‌ కంటే ఇంకా 236 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి:  ‘నన్ను ఇరికించి.. నువ్వు వాళ్ల భజన చేస్తున్నావు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement