తాడేపల్లి : ఆసియా క్రీడల్లో సత్తాచాటిన భారత ఆర్చరీ క్రీడాకారులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఆసియా క్రీడల్లో ఆర్చరీ విభాగంలో స్వర్ణపతకాలు సాధించడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ చూపారనీ, భారతదేశ కీర్తిని మరింత పెంచారని వైఎస్ జగన్ కొనియాడారు.
ఆర్చరీ ఈవెంట్‌లో భాగంగా పురుషులు కాంపౌండ్ టీమ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ రాజేశ్ జాధవ్, గణేశ్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. ప్రత్యర్థి చైనాను 238-237 తేడాతో ఓడించిన భారత్.. పసిడిని అందుకుంది. వీరి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని యువ క్రీడాకారులు ముందుకు సాగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. గణేష్ మణిరత్నం ఏపీకి చెందిన క్రీడాకారుడు కావటం మనందరికీ గర్వకారణమన్నారు వైఎస్ జగన్.
ఇదీ చదవండి: ఆర్చరీలో హ్యాట్రిక్.. భారత్ ఖాతాలో 10వ స్వర్ణం


