Photo Credit: Twitter
హరారే వేదికగా జింబాబ్వే వుమెన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ సెంచరీతో మెరిసింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (113 బంతుల్లో 118; 18 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ చేయగా, వికెట్ కీపర్ షిమెయిన్ క్యాంప్‌బెల్లె (119 బంతుల్లో 96) సెంచరీ చేజార్చుకుంది.
మిగిలిన బ్యాటర్లలో జన్నిలియా గ్లాస్కో (26 నాటౌట్), జహారా క్లాక్స్‌టన్ (11 నాటౌట్) చివర్లో మెరిశారు. జింబాబ్వే బౌలర్లలో నొమ్‌వెలో సిబండ, బిజా చెరో 2 వికెట్లు తీశారు. కాగా విండీస్ కెప్టెన్‌కు ఇది 14వ సెంచరీ కాగా, అంతర్జాతీయంగా 17వ సెంచరీ కావడం విశేషం. సూపర్ ఫామ్‌లో ఉన్న హేలీ మాథ్యూస్ ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది.
ఆమెకు తోడు షిమెయిన్ క్యాంప్‌బెల్లె కూడా జింబాబ్వే బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఇక ఇదే సిరీస్‌లో తొలి వన్డేలో హేలీ మాథ్యూస్ 156 బంతుల్లో 182 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి వన్డేలో విజయం సాధించిన విండీస్‌కు రెండో వన్డేలో మాత్రం జింబాబ్వే షాక్ ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
A captain's knock from Hayley Matthews in the ODI series decider as she brings up another ton in Harare 💯👏
📸: @windiescricket
📝: https://t.co/6rI12PWvYw pic.twitter.com/CdUAp3mTrc— ICC (@ICC) September 30, 2026
ఇదీ చదవండి: IND Vs WI: చరిత్ర సృష్టించిన విండీస్ ఓపెనర్


