PC: BCCI X
బర్సపరా స్టేడియంలో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ కాస్త ఎక్కువగా పచ్చికతో కూడి ఉంది. ఇక్కడ మంచు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. కాబట్టి మా బౌలర్లకు కఠిన సవాలు తప్పదు. మా జట్టులో ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు.
ఆకిబ్ నబీ అరంగేట్రం
మా తుదిజట్టులో ఒక మార్పు చేశాము. ఆకిబ్ నబీ అరంగేట్రం చేస్తున్నాడు’’ అని తెలిపాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో నబీ తుదిజట్టులోకి వచ్చినట్లు గిల్ వెల్లడించాడు. కాగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చేతుల మీదుగా నబీ టీమిండియా క్యాప్ అందుకున్నాడు.
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first in the 2️⃣nd ODI.
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#INDvWI | @mflone_ pic.twitter.com/F7QLtGTYxJ— BCCI (@BCCI) September 30, 2026
మరోవైపు.. వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. జస్టిన్ గ్రీవ్స్, జువెల్ ఆండ్రూ, మాథ్యూ ఫోర్డె, గుడకేశ్ మోటి స్థానాల్లో షెర్ఫానే రూథర్‌ఫర్డ్, కీమో పాల్, షమార్ జోసెఫ్, విటెల్ లావెస్ వచ్చారు.
1-0తో ఆధిక్యంలో
కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు కరేబియన్ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో భారత్ విండీస్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలో ఉంది. తాజాగా గువాహటి వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఎవరీ ఆకిబ్ నబీ?
జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆకిబ్ నబీ ఫాస్ట్ బౌలర్. గత రెండు రంజీ ట్రోఫీ ఎడిషన్లలో కలిపి 29 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ వందకు పైగా వికెట్లు పడగొట్టాడు.
ఇక గత సీజన్లో ఏకంగా 60 వికెట్లు కూల్చి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇందులో ఏకంగా ఎనిమిది సార్లు నబీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం గమనార్హం.
అయితే, రంజీల్లో సత్తా చాటినప్పటికీ ఆకిబ్ నబీకి ఇంత వరకు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, అనూహ్య రీతిలో వన్డేల్లో తాజాగా అడుగుపెట్టాడు.
భారత్ వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే తుదిజట్లు
భారత్
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధిర్, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ
వెస్టిండీస్
జాన్ కాంప్‌బెల్, కేసీ కార్టీ, షాయీ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆమిర్ జాంగో, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రోస్టన్ ఛేజ్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, జేడన్ సీల్స్, విటెల్ లావెస్


