‘పసిడి’ పరుగుల రాణి.. | Kodavath Swapna Telangana Athletics Gold Medals | Sakshi
Sakshi News home page

‘పసిడి’ పరుగుల రాణి..

Sep 30 2026 12:37 PM | Updated on Sep 30 2026 12:37 PM

Kodavath Swapna Telangana Athletics Gold Medals

జాతీయస్థాయి ‘ట్రాక్‌’ పోటీల్లో  మెరిసిన గిరిజన ఆణిముత్యం

అంతర్జాతీయ వేదికే లక్ష్యంగా రన్నింగ్‌లో రాణిస్తున్న కొడావత్‌ స్వప్న

1500, 3000 మీటర్ల పరుగు పోటీల్లో రెండు స్వర్ణాలు

జాతీయస్థాయి జూనియర్‌  చాంపియన్‌షిప్‌కు అర్హత

నిరుపేద కుటుంబం.. ఆటోడ్రైవర్‌ తండ్రి.. కూలీ పనులు చేసే తల్లి.. అయినా లక్ష్యం విషయంలో వెనక్కి తగ్గలేదు. కష్టాలను అధిగమి స్తూ అథ్లెటిక్స్‌లో అంచెలంచెలుగా ఎదిగింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు పరుగులు తీస్తోంది నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కొడావత్‌ తండాకు చెందిన కొడావత్‌ స్వప్న.

హనుమకొండలో ఈ నెల 26, 27న జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వప్న రెండు స్వర్ణ పతకాలు సాధించింది. 1500 మీటర్ల పరుగును 5 నిమిషాల 4 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం దక్కించుకోగా.. 3000 మీటర్ల పరుగును 11 నిమిషాల 18 సెకన్లలో పూర్తి చేసి మరో స్వర్ణం సాధించింది. ఈ ప్రదర్శనతో 41వ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించింది.

జాతీయ స్థాయిలోనూ స్వర్ణం 
ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–20 బాలికల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వప్న స్వర్ణ పతకం సాధించింది. దీంతో జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తదుపరి జూనియర్‌ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటి.. అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది ఆమె లక్ష్యం.

హనుమకొండలో బంగారు పతకం అందుకుంటున్న స్వప్న

బాబాయ్‌  ప్రోత్సాహంతో.. 
చిన్నతనంలో బాబాయ్‌ కొడావత్‌ రవి రాంచో ప్రతి రోజూ రన్నింగ్‌కు వెళ్లడాన్ని చూసిన స్వప్నకు పరు గు పందెంపై ఆసక్తి పెరిగింది. ఆమె ప్రతిభను గు ర్తించిన రవి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. నాలు గో తరగతిలోనే స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేరి్పంచాడు. పదో తరగతి వరకు కరీంనగర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో చదువుతోపాటు అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందింది. అక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగింది.

ఎస్‌ఏఐలో శిక్షణ 
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐ)లో ఎంపికైన స్వప్నకు అక్కడ శిక్షణ పొందే అవకాశం లభించింది. కోచ్‌ సుబ్బారావు మార్గదర్శకత్వంలో నిరంతరం సాధన చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంది. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది.

ఆటోడ్రైవర్‌ తండ్రి.. కూలీ తల్లి
స్వప్న తండ్రి కొడావత్‌ మాన్య నాయక్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి కొడావత్‌ నీల రోజు వారీ కూలీ పనులు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూతురిలోని క్రీడా ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వారి సహకారంతో స్వప్న సాధన కొనసాగించింది.

అంతర్జాతీయ వేదికే లక్ష్యం
‘‘భవిష్యత్‌లో అంతర్జాతీయ పోటీల్లో భారత్‌ కు ప్రాతినిధ్యం వహించి దేశానికి మంచి పేరు తీసుకురావడమే నా లక్ష్యం’’ అని స్వప్న చెబుతోంది. కొడావత్‌ తండా నుంచి జాతీయస్థాయి వరకు సాగిన ఆమె విజయ ప్రస్థానం గ్రామీణ ప్రాంతాల యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇదీ చదవండి: శెభాష్‌.. కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement