సాక్షి, జనగామ: దానం నాగేందర్ వికెట్ పడింది. రెండో వికెట్ కడియం శ్రీహరిదేనంటూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు దెబ్బ తగిలితే రాజకీయ సమాధే. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి. రాజీనామా చేసి వస్తే ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం’’ అంటూ రాజయ్య సవాల్ విసిరారు.
‘‘సర్వేలు అన్నీ నీకు అనుకూలం అంటున్నావు కదా.. రా చూసుకుందాం. నువ్వు నాలుగు సార్లు.. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచాం. నువ్వు నేను ఇద్దరం మాజీ ఉప ముఖ్యమంత్రులమే. నాది ప్రజా బలం. నీది కుట్రలు కుతంత్రాల రాజకీయం. పదేపదే అటు ఢిల్లీకి ఇటు రేవంత్ రెడ్డి వద్దకు తన కూతురుతో కలిసి వెళ్తున్నాడు. అభివృద్ధి కోసం కాదు.. మంత్రి పదవి కోసం చక్కర్లు కొడుతున్నాడు. కడియం శ్రీహరి రాసి పెట్టుకో.. ఇక నీ జీవితంలో మంత్రివి కాలేవు. నువ్వుచేసిన అభివృద్ధిపై అంబేద్కర్ విగ్రహం వద్ద శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అంటూ రాజయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు


