Auqib Nabi
-
టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్
రాబోయే అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత (జూన్‌లో) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే సిరీస్ (టెస్ట్, మూడు వన్డేలు) కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నబీ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. నబీ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించి 60 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. నబీ సంచలన ప్రదర్శనల కారణంగా జమ్మూ కశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. నబీ స్థిరమైన వేగంతో పాటు బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సమర్దుడు. 41 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 156 వికెట్లు తీశాడు.భారత టెస్టు జట్టులో గత కొంతకాలంగా పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా బుమ్రాపైనే పడుతుంది. ఇతర బౌలర్లు కూడా కొంతమేరకు సహకరించినప్పటికీ, స్థిరమైన ప్రత్యామ్నాయం అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నబీ వంటి యువ బౌలర్ జట్టులోకి వస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా బౌలింగ్ విభాగానికి లోతు పెరుగుతుంది.అందుకే భారత సెలెక్టర్లు నబీని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. నబీ బౌలింగ్ శైలి సుదీర్ఘ ఫార్మాట్‌కు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఐపీఎల్ ఛాన్స్ కొట్టేసిన నబీ.. ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను 2 మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి సెలెక్టర్లు నబీని టెస్ట్‌లకే పరిమితం చేస్తారో లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ అవకాశాలు ఇస్తారో చూడాలి. -
ప్రధాని మోదీ నోట సాధారణ క్రికెటర్ మాట
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఓ సాధారణ క్రికెటర్ మాట వినిపించింది. ఇవాళ (మార్చి 29) జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఆ క్రికెటర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ క్రికెటర్ పేరు ఆకిబ్ నబీ. జమ్మూ అండ్ కశ్మీర్‌కు చెందిన ఈ 29 ఏళ్ల కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్, ఇటీవల తన జట్టు తొలి రంజీ ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్ మొత్తంలో 60 వికెట్లు తీసి, తన జట్టు 70 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఈ కారణంగానే మోదీ నబీ పేరును మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. నబీ కారణంగా జమ్మూ అండ్ కశ్మీర్ సాధించిన విజయం అక్కడి యువతలో క్రీడలపై ఉత్సాహం పెంచిందని అన్నారు. నబీ స్పూర్తితో రాబోయే రోజుల్లో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ సాధారణ క్రికెటర్ మాట ప్రధాని నోట రావడంతో అతని పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది.దేశవాలీ క్రికెట్లో ఇప్పటికే పేరు గడించిన నబీ, త్వరలో ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్ (2026) వేలంలో నబీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్ల భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఫ్రాంచైజీలు పోటీపడినా, చివరికి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఈ డీల్‌తో నబీ జీవితమే మారిపోనుంది. ఐపీఎల్లో అతను సత్తా చాటగలిగితే, టీమిండియా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించి మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానం ఖాళీగా ఉంది. పవర్‌ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నబీ ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పేసర్లు లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడం ఇష్టపడతారు కాబట్టి, నబీ పవర్‌ప్లేలో కీలకంగా మారవచ్చు. ఢిల్లీ ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ప్రయాణం మొదలుపెడుతుంది. -
IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీమిండియా స్టార్లుగా చెలామణి అవుతున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సహా ఎందరో క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఐపీఎల్లే అనడంలో సందేహం లేదు. 2008 నుంచి 18 సీజన్ల పాటు నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. గత సీజన్లో బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్లోకి వచ్చి చేరింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్లోనూ అలా రాణించగల సమర్థులెవరన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.జూనియర్ మిల్లర్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ తరహా బ్యాటింగ్ శైలిని పోలి ఉండే 20 ఏళ్ల అమేథీ కుర్రాడు ప్రశాంత్ వీర్‌పై ఈ సీజన్లో భారీ అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా ఆశించినంతంగా ఫలితాలు రాకపోవడంతో జట్టులో యువ ఆటగాళ్లను నింపేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే వేలంలో ప్రశాంత్ వీర్‌ను ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. దేశవాలీ క్రికెట్లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ వీర్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. ఆ టోర్నీలో 320 పరుగులు చేయడంతో 8 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్ కావడంతో జడ్డూ స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్ అంచనాలను అందుకుంటాడా అన్నది చూడాలి.సిక్సర్లకు పెట్టింది పేరు..చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడనున్న మరో విధ్వంసక వీరుడు కార్తిక్ శర్మ. రాజస్థాన్‌కు చెందిన కార్తిక్ శర్మ అవలీలగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే వేలంలో సీఎస్కే ఇతడిని రూ. 14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్‌హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో కార్తిక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.ఇక వేలంలో కార్తిక్ శర్మ కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటేనే మనోడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్స్‌లు కొట్టిన కార్తీక్ చెన్నై జట్టుకు కీలక బ్యాటర్‌గా మారే అవకాశముంది.ఢిల్లీ ఆశాకిరణం..ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్లో బాగా వినిపిస్తున్న పేరు అకిబ్ నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆకిబ్ నబీ టైటిల్ అందిస్తాడేమో చూడాలి. ఒకవేళ నబీ ఆ ఫీట్‌ను సాధిస్తే మాత్రం టీమిండియాలోకి పిలుపు రావడం లాంఛనమే అవుతుంది.ఆ కొరత తీరినట్లే!భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి అదరగొడుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్‌లో అతడు పది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ సత్తాచాటితే టీమ్ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికేసినట్లే.దంచుడే లక్ష్యంగా..ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడబోతున్న తేజస్వీ దహియా కూడా విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు బరిలోకి దిగిందే తడవు దంచుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం అతడి నైజం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్‌లో తేజస్వీ దహియా 10 ఇన్నింగ్స్‌ల్లో 190 సగటుతో 339 రన్స్ సాధించాడు. ఆ సీజన్లో దహియా 29 సిక్స్‌లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. కీపర్‌గాను అద రగొడుతున్నాడు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు ఈసారి ఐపీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.చదవండి: ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం! -
'ఐపీఎల్ కాదు.. టీమిండియాకు ఆడడమే నా టార్గెట్'
జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ ధార్ ఐపీఎల్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నబీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుండడంతో గతేడాది జరిగిన మినీ వేలంలో నబీని రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.కేవలం రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీనీ ఇతరు ఫ్రాంచైజీలతో పోటీపడి మరి ఢిల్లీ సొంతం చేసుకుంది. అయితే తాజాగా విలేకరుల సమావేశంలో నబీ పలు విషయాలను పంచుకున్నాడు. వేలం రోజు తన ఇంట్లో జరిగిన సందడిని నబీ గుర్తు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ ఎంపిక కావడం సంతోషంగా ఉన్నప్పటికి, భారత్ తరపున ఆడడమే తన అంతిమ లక్ష్యమని నబీ తెలిపాడు."నాకు డబ్బు ముఖ్యం కాదు. కనీసం ఒక్కసారైనా ఐపీఎల్ వంటి మెగా టోర్నమెంట్లో ఆడాలనుకున్నాను. నాకు కనీస ధర రూ.30 లక్షలు వచ్చి ఉన్నా కూడా నేను సంతోషంగా ఉండేవాడిని. ఏదేమైనప్పటికి ఢిల్లీ ఇంత భారీ మొత్తం వెచ్చించి తీసుకోవడం నాకు ఆనందం కలిగించింది. వేలం రోజున నేను ఇంట్లోనే ఉన్నాను. వేలంలో నేను అమ్ముడుపోగానే బయట నం డ్యాన్స్‌లు చేస్తూ, బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. నా కటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు. ఆ సమయంలో నేను కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. కానీ నేను ఇంట్లో ఉన్నానని వారికి తెలియదు. అయినప్పటికి నా విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్ నా కెరీర్‌ను మరింత ముందుకు తెసుకువెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి టోర్నమెంట్. దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తానే ఇక్కడ ఆడే అవకాశం లభిస్తోంది. నేను రెడ్ బాల్ క్రికెట్లో బాగా రాణించానని అన్పిస్తోంది. అందుకే నాకు ఆడే అవకాశం దక్కింది. ఇక్కడ కూడా బాగా రాణించి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా అంతిమ లక్ష్యమని" నబీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్ -
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
ఆకిబ్ నబీ.. భారత క్రికెట్లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అతడి అత్యద్భుత ప్రదర్శనలు ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో ఈ పేస్ బౌలర్‌ది కీలక పాత్ర.స్పందించిన బీసీసీఐసీజన్ ఆసాంతం అద్భుత ఆట తీరుతో జట్టును గెలిపించిన ఆకిబ్ నబీ (Auqib Nabi Dar)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు.అతడిదే కీలక పాత్రత్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆకిబ్ ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదేనని స్పష్టం సైకియా చేశాడు. ‘‘అతడు అద్భుతంగా ఆడాడు. జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర.క్వార్టర్ ఫైనల్లో ఐదు వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతడి బౌలింగ్ ఫైనల్ రాతను మార్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిని అతడు ఆకర్షించగలిగాడు.రంజీ ట్రోఫీకి సంబంధించి ప్రతి మ్యాచ్‌కు మా సెలక్టర్లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాము. ఫైనల్ సహా కీలక మ్యాచ్‌లన్నీ మా సెలక్టర్లు వీక్షించారు. వాళ్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారనే అనుకుంటున్నా. ఇప్పటికే అతడు లైమ్‌లైట్‌లో ఉన్నాడు. సెలక్టర్లే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరగకుండా బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుంది. మా సెలక్టర్లు అతడితో పాటు మ్యాచ్‌లో మెరుగ్గా రాణించిన అందరి ఆటను గమనించారు. నబీని వెలుగులోకి తీసుకుచ్చింది ఎవరు?.. అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. జమ్మూ కశ్మీర్ సెలక్టర్లే కదా!.. దేశీ క్రికెట్లో రాష్ట్ర జట్టు తరఫున అదరగొట్టిన వారికి బీసీసీఐ సెలక్టర్లు కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.60 వికెట్లు కూల్చాడుకాగా కర్ణాటకతో ఫైనల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో రాణించి.. కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా అవతరించింది. తాజా రంజీ సీజన్లో 29 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ఏకంగా 60 వికెట్లు కూల్చాడు. ఇందులో ఎనిమిది ఫైవ్ వికెట్లు హాల్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆకిబి నబీ అరంగేట్రానికి డిమాండ్లు పెరుగుతున్నాయి. చదవండి: ప్రపంచకప్ వైఫల్యాల తర్వాత కూడా బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు -
అతడు అద్బుతాలు చేస్తాడు.. టీమిండియాకు ఎంపిక చేయండి: గంగూలీ
ఫిబ్రవరి 28, 2026.. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జమ్మూ అండ్ కాశ్మీర్ తమ 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించుతూ తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హుబ్లీ వేదికగా జరిగిన జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ చారిత్రత్మక విజయంలో ఆ జట్టు పేసర్ ఆకిబ్ నబీ ధార్ది కీలక పాత్ర. ఈ సీజన్ అసాంతం ఆకిబ్ నబీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ సీజన్లో మొత్తం 60 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక పేసర్ 60 వికెట్ల మార్కును అందుకోవడం ఇది కేవలం మూడవసారి మాత్రమే. ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఆకిబ్ దుమ్ములేపాడు. 29 ఏళ్ల నబీ తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.మొత్తంగా 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక ఓటమిని శాసించాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ బ్యాటర్లను సైతం నబీ బోల్తా కొట్టించాడు. నబీ తన సంచలన ప్రదర్శనలతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సైతం ఆకర్షించాడు.రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ఆకిబ్ నబీని ఎంపిక చేయాలని గంగూలీ సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆకిబ్ స్వింగ్ బౌలింగ్ భారత్‌కు ఉపయోగపడుతుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు."ప్రయత్నం, దృడ సంకల్పం ఉంటే ఏం చేయగలరో జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి చాటి చెప్పింది. జమ్మూ కశ్మీర్ చారిత్రత్మక విజయంతో ఆ ప్రాంతం మొత్తం గర్వించేలా చేశారు. కఠిన పరిస్థితులే ఛాంపియన్లను తాయారు చేస్తాయి. ఆకిబ్ నబీ నిజంగా ఒక అద్భుతం.నబీ ఇప్పుడు టీమిండియా జెర్సీ ధరించేందుకు సమయం అసన్నమైంది. ఈ ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌కు నబీని ఎంపిక చేస్తే బాగుంటుంది" అని ఎక్స్‌లో దాదా రాసుకొచ్చాడు. కాగా బారముల్లాకు చెందిన నబీ.. ఐపీఎల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. గత డిసెంబర్లో జరిగిన వేలంలో రూ. 8.4 కోట్ల భారీ ధరకు ఆకిబ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. -
చరిత్ర ఆవిష్కృతం.. భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి
జమ్మూ కశ్మీర్ సరికొత్త చరిత్ర ఆవిష్కరించింది. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో ఫైనల్లో విజయ లాంఛనాన్ని శనివారం ముగించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.అసాధారణ విజయాలతోదేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో జమ్మూ కశ్మీర్ అసాధారణ విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఆద్యంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను సైతం ఓడిస్తూ టైటిల్ రేసులో నిలిచింది.ఈ క్రమంలో హుబ్లి వేదికగా కర్ణాటకతో ఫైనల్లో తలపడిన జమ్మూ కశ్మీర్ ఇక్కడా జోరు కనబరిచి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. KSCA హుబ్లి క్రికెట్ గ్రౌండ్లో టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 584 పరుగులు సాధించింది.సమిష్టిగా రాణించిన బ్యాటర్లుయావర్ హసన్ (88), కెప్టెన్ పారస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వాధవాన్ (70), సాహిల్ లోట్రా (72) అర్ధ శతకాలతో రాణించగా.. శుభం పండిర్ శతక్కొట్టడం (121)తో ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక ఇందుకు బదులిచ్చేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 293 పరుగులకే కుప్పకూలింది.చెలరేగిన ఆకిబ్ నబీస్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (13) విఫలం కాగా.. మరో సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్కాల్ (160) భారీ శతకంతో రాణించాడు. మిగిలిన వారిలో శ్రేయస్ గోపాల్ (27), కృతిక్ క్రిష్ణ (36) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జమ్మూ కశ్మీర్‌ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో చెలరేగి కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.అజేయ సెంచరీల సాక్షిగా ఈ క్రమంలో 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి కర్ణాటకపై ఓవరాల్‌గా 477 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన శనివారం రోజు ఆటలో భాగంగా ఓపెనర్ కమ్రాన్ అక్మల్ అజేయ శతకం (160) పూర్తి చేసుకోగా.. సాహిల్ లోట్రా కూడా సెంచరీ (101)తో నాటౌట్‌గా నిలిచాడు.సాహిల్ శతకం పూర్తి చేసుకోగానే జమ్మూ కశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కశ్మీర్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అయితే, నిబంధనల ప్రకారం ఫలితం తేలనట్లయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.సీఎం అభినందనలుపారస్ డోగ్రా ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించినప్పటికీ ఆఖరి రోజు కమ్రాన్, సాహిల్ సెంచరీల సాక్షిగా.. చారిత్రాత్మక విజయాన్ని జమ్మూ కశ్మీర్‌కు అందించాడు. కాగా సాహిల్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం. అది కూడా చారిత్రాత్మక విజయం సందర్భంగా సాధించడం విశేషం. చదవండి: IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?A maiden First-Class century 💯On the grandest stage of all 🏟️A moment he will never forget ✨Sahil Lotra puts up a performance that he will remember for a lifetime 🫡Updates ▶️ https://t.co/G0ytZLEyNB#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/YOl1SgTEmD— BCCI Domestic (@BCCIdomestic) February 28, 2026 ఇక జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలిచిన క్షణాలను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యక్షంగా తిలకించారు. భారత క్రికెట్ నియంత్రణమండలి (BCCI) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సైతం ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచాడు. వీరిద్దరు కరతాళ ధ్వనులతో సాహిల్‌తో పాటు కశ్మీర్ జట్టును అభినందించారు. -
టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆకిబ్ నబీ
ప్రస్తుత రంజీ సీజన్లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనలతో ప్రత్యర్ది బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లోనూ అదే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించి, ఆట కట్టించాడు. ఈ క్రమంలో మరో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నబీ విజృంభించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకే ఆలౌటై, జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు (584) చాలా వెనుకపడి పోయింది. జమ్మూ బౌలర్లలో నబీతో పాటు సునీల్ కుమార్ (19-6-51-2), యుద్ద్‌వీర్ సింగ్ (14.3-3-55-2), సాహిల్ లోత్రా (12-1-50-1) సత్తా చాటారు. కర్ణాటక తరఫున ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (160) ఒంటరిపోరాటం చేసినా తన జట్టు పటిష్ట స్థితికి చేర్చలేకపోయాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లభించలేదు. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (13), దేవ్‌దత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0), స్మరణ్ రవిచంద్రన్ (0) దారుణంగా విఫలమయ్యారు.అంతకుముందు షుభమ్ పుండిర్ (121) అద్భుత సెంచరీతో, యావర్ హస్సన్ (88), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వధావన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో జమ్మూ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్‌లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫైనల్‌కు చేరడంలో ఆకిబ్ నబీ పాత్ర చాలా కీలకం. అతను దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటి జమ్మూను తొలిసారి రంజీ ఫైనల్‌కు చేర్చాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో (క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ తొలి ఇన్నింగ్స్) నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు.. సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, ఇప్పుడు ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. తాజా ప్రదర్శన తర్వాత నబీ ఈ రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. నబీ ఈ సీజన్లో ఏకంగా 60 వికెట్లు తీశాడు.ఎలా ఎంపిక చేయరో చూస్తా..!ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపిచినట్లైంది. ఇంతటి అద్భుత ప్రదర్శన కనబర్చిన నన్ను టీమిండియాకు ఎలా ఎంపిక చేయరో చూస్తా అన్న సందేశాన్ని పంపాడు. 29 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. స్వింగ్ బౌలింగ్‌లో దిట్ట. ఎంతటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగలిగే శక్తి అతని దగ్గర ఉంది. అలాగే యార్కర్లు సంధించడంలోనూ అతను దిట్ట. కేఎల్ రాహుల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ నబీని ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడంటే అతను ఎంత ప్రమాదకారో అర్దమవుతుంది. భారత సెలెక్టర్లు షమీలా కాకుండా నబీకి అవకాశాలు ఇచ్చి టీమిండియాకు మేలు చేయాలని ఆశిద్దాం. -
సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్
జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో బెంగాల్‌ను మట్టికరిపించి తమ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్‌లో భాగంగా బెంగాల్- జమ్మూ కశ్మీర్ మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది. బెంగాల్‌లోని కళ్యాణి వేదికగా టాస్ గెలిచిన కశ్మీర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఘరామి సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దగిన బెంగాల్.. తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌట్ అయింది. సుదీప్ కుమార్ ఘరామి (146) సెంచరీ సాధించి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కశ్మీర్ బౌలర్లలో పేస్ సంచలన ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో చెలరేగగా.. సునిల్ కుమార్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. యుధ్వీర్ సింగ్ చరఖ్, అబిద్ ముస్తాక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్‌కు దిగి 302 పరుగులకు ఆలౌట్ అయింది. అబ్దుల్ సమద్ 82 పరుగులతో రాణించగా.. కెప్టెన్ పారసస్ డోగ్రా (58), ఆకిబ్ నబీ (42) కూడా మెరుగైన స్కోర్లు సాధించారు. బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీ ఎనిమిది వికెట్లు కూల్చగా.. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.చెలరేగిన కశ్మీర్ బౌలర్లుఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్‌కు కశ్మీర్ బౌలర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు. పటిష్ట బెంగాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేస్తూ 99 పరుగులకే కుప్పకూల్చారు. టాపార్డర్‌లో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ ఐదు పరుగేల చేయగా.. సుదీప్ ఛటర్జీ, సుదీప్ కుమార్ ఘరామి డకౌట్ అయ్యారు. ఓపెనర్ల వికెట్లతో పాటు సూరజ్ (14), షాకిర్ హబీబ్ గాంధీ (10) వికెట్లను ఆకిబ్ తన ఖాతాలో వేసుకున్నాడు.మిగిలిన వారిలో సునిల్ కుమార్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. యుధ్వీర్ రెండు వికెట్లు దక్కించకున్నాడు. ఈ క్రమంలో బెంగాల్ విధించిన 126 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కశ్మీర్నాలుగో రోజు ఆటలో పూర్తి చేసింది. ఓపెనర్లు శుభం ఖజూరియా (1), యావర్ హసన్ (6, కెప్టెన్ డోగ్రా (9) విఫలమైనా.. శుభం పందిర్ (27), వన్షజ్ శర్మ (43 నాటౌట్), అబ్దుల్ సమద్ (30 నాటౌట్) పనిపూర్తి చేశారు. తొలిసారి రంజీ ఫైనల్లోలక్ష్య ఛేదనలో నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసిన జమ్మూ కశ్మీర్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా తొమ్మిది వికెట్లు తీసిన ఆకిబ్ నబీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ 𝙎𝘾𝙀𝙉𝙀𝙎 𝙊𝙁 𝙋𝙐𝙍𝙀 𝙅𝙐𝘽𝙄𝙇𝘼𝙏𝙄𝙊𝙉 🤩J&K create history as they defeat Bengal by 7️⃣ wickets to book their ticket to the #RanjiTrophy Final for the very first time 🫡Scorecard ▶️ https://t.co/QXyCuRHJ6e@IDFCFIRSTBank pic.twitter.com/VBKPD9I9mX— BCCI Domestic (@BCCIdomestic) February 18, 2026 -
నిప్పులు చెరిగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
టీమిండియా వెటరన్ పేసర్, బెంగాల్ బౌలింగ్ స్టార్ మొహమ్మద్ షమీ మరోసారి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జమ్మూ కశ్మీర్- బెంగాల్ మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది.328 పరుగులకు ఆలౌట్‌టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బెంగాల్ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (49), షాబాజ్ అహ్మద్ (42) రాణించగా.. సుదీప్ కుమార్ ఘరామి (146) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో సుమంత గుప్తా 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 97.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయింది.జమ్మూ కశ్మీర్ బౌలర్లలో స్టార్ పేసర్ అకీబ్ నబీ (Auqib Nabi) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. సునిల్ కుమార్ (Sunil Kumar) మూడు, యుధ్వీర్ సింగ్ చరఖ్, అబిద్ ముస్తాక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం జమ్మూ కశ్మీర్ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 302 పరుగులకు ఆలౌట్ అయింది.ఆది నుంచే నిప్పులు చెరిగిన షమీఆది నుంచే నిప్పులు చెరిగిన బెంగాల్ పేసర్ షమీ.. ఓపెనర్లు శుభం ఖజూరియా (3), యావర్ హసన్ (2)లను వచ్చీరాగానే వెనక్కి పంపాడు. అదే విధంగా అబ్దుల్ సమద్ (82), కన్హయ్య వాధవాన్ (29) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు.అంతేకాదు.. అబిద్ ముస్తాక్ (27), వన్షజ్ శర్మ (3), ఆకిబ్ నబీ (42), యుధ్వీర్ సింగ్ చరఖ్ (33)ల వికెట్లు కూడా షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మిగిలిన బెంగాల్ బౌలర్లలో టీమిండియా స్టార్ ముకేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ విజృంభణ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 26 పరుగుల ఆధిక్యం సంపాదించగలిగింది.ఆడినా లాభమేంటి?గతేడాది మార్చిలో చివరగా టీమిండియా తరఫున వన్డే బరిలో దిగాడు షమీ. అంతకు ముందు నెలలో టీ20లు ఆడాడు. అయితే, అతడు భారత్ తరఫున టెస్టులు ఆడి దాదాపు మూడేళ్లు కావస్తోంది.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తా చాటినా టీమిండియా సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. తాజా రంజీ సీజన్లోనూ ఆకట్టుకున్నా అతడికి పిలుపునివ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీకి మ్యాచ్ ఫిట్నెస్ లేదని వ్యాఖ్యానించగా.. తాను ఆటతోనే సమాధానం చెబుతున్నానని షమీ కౌంటర్ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే తాజా మ్యాచ్‌లోనూ సత్తా చాటి మరోసారి టీమిండియా సెలక్ట ర్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు.An 8️⃣-wicket masterpiece 🫡Watch 🎥Mohd. Shami wreaks havoc with his career-best First Class figures of 8/90 🔥 Updates ▶️ https://t.co/QXyCuRIgVM#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/f4F3TYnSWi— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2026చదవండి: గంభీర్‌కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్‌కోచ్ పదవికి గుడ్‌బై? -
మధ్యప్రదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన జమ్మూ కశ్మీర్
రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో ఆదివారం జార్ఖండ్‌ను ఓడించి చిన్న జట్టు ఉత్తరాఖండ్ తొలి సారి టోర్నీ సెమీస్ చేరగా... తర్వాతి రోజే దేశవాళీ క్రికెట్లో మరో చిన్న జట్టు జమ్మూ కశ్మీర్ జట్టు ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేసింది. 67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో జమ్మూ కశ్మీర్ మొదటి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 1959–60 సీజన్లో తొలి సారి ఈ టోర్నీలో ఆడిన జట్టు ఇన్నేళ్ల తర్వాత సెమీస్ చేరడం విశేషం. సోమవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కశ్మీర్ 56 పరుగుల తేడాతో 2021–22 చాంపియన్ మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. ఐదేసిన ఆఖిబ్ నబీఇండోర్ వేదికగా 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 87/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్.. 68.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. సారాంశ్ జైన్ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో పోరాడగా...శుభమ్ శర్మ (32) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (17) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. పేస్ బౌలర్ ఆఖిబ్ నబీ (5/70) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా...ఆబిద్ ముస్తాక్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 వికెట్లు పడగొట్టిన ఆఖిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సెంచరీతో గెలిపించిన రాహుల్... భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (182 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ముందుండి నడిపించగా చిరకాల ప్రత్యర్థి, 42 సార్లు విజేత అయిన ముంబైని ఓడించి కర్నాటక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఎనిమిది సార్లు చాంపియన్ కర్నాటక సోమవారం ఆసక్తికరంగా ముగిసిన క్వార్టర్స్ పోరులో 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 113/2తో కర్నాటక నాలుగో రోజు ఆట కొనసాగించింది. కరుణ్ నాయర్ ((13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... రాహుల్, రవిచంద్రన్ స్మరణ్ (123 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. తొలి సెషన్లోనే 147 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. లంచ్ తర్వాత కర్నాటక ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురైంది. 19 పరుగుల వ్యవధిలో రాహుల్, శ్రేయస్ గోపాల్ (1), కృతిక్ కృష్ణ (2) అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొద్ది సేపు మైదానంలో వాదనలు కూడా జరిగాయి. అయితే స్మరణ్, విద్యాధర్ పాటిల్ (30 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును గట్టెక్కింటారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 40 పరుగులు జత చేశారు. ఆదివారం నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్‌తో కర్నాటక తలపడుతుంది. -
చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
భారత ఫాస్ట్ బౌలింగ్ సంచలనం, జమ్మూ అండ్ కశ్మీర్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీ దార్ విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న (జనవరి 8) హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన దార్.. సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. 269 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ అండ్ కశ్మీర్ 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.ఈ దశ బరిలోకి దిగిన దార్ సుడిగాలి శతకం బాది తన జట్టును గెలిపించాడు. 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఎండ్ నుంచి విన్ష్రాజ్ శర్మ (69 నాటౌట్) అద్భుతంగా సహకరించాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 182 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో దార్ బౌలింగ్‌లోనూ రాణించాడు. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. అమన్ రావ్ (60), రాహుల్ సింగ్ (56), నితేశ్ రెడ్డి (54 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో దార్ 3, ఆబిద్ ముస్తాక్ 2, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వన్ష్‌రాజ్ శర్మ, సాహిల్ లోత్రా తలో వికెట్ తీశారు. అనంతరం 269 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ కశ్మీర్ ఓటమి దిశగా సాగినప్పటికీ.. దార్ సూపర్ సెంచరీ కారణంగా అనూహ్యంగా పుంజుకొని చిరస్మరణీయ విజయం సాధించింది. -
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతోఅబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆఖిబ్ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్ పరాఖ్ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.చవక ధరకే బెస్ట్ ప్లేయర్లుఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్ డిజిట్ స్కోర్ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.వేలంలో చవక ధరకే డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఆఖిబ్ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధరఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్గిడి (రూ.2 కోట్లు), బెన్ డకెట్ (రూ. 2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 వేలంలో దేశీ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, రవి బిష్ణోయి, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. పాటు విదేశీ ప్లేయర్లు కామెరాన్ గ్రీన్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి వారు హైలైట్ కానున్నారు. స్టార్లను మినహాయించితే ఈ ఐదుగురు భారత అన్క్యాప్డ్ బౌలర్లు కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది.ఆకిబ్ నబీజమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ. అనుభవం, నైపుణ్యాలు కలిగిన ఈ ఫాస్ట్‌బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం. తాజా దేశీ సీజన్లలో అతడు అద్భుత ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణం. 2025-26 రంజీ సీజన్లో అదరగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దుమ్ములేపాడు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు 15 వికెట్లు కూల్చిన ఆకిబ్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. వేలానికి ముందు అతడి ఈ అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాంఛైజీలను ఊరిస్తోంది.ఈడెన్ ఆపిల్ టామ్కేరళకు చెందిన తాజా బౌలింగ్ సంచలనం ఈడెన్ ఆపిల్ టామ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు 20 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్. తాజా రంజీ సీజన్లో మధ్యప్రదేశ్‌పై (4/55 & 2/33) ఉత్తమ గణాంఖాలు నమోదు చేశాడు.ఇక మొత్తంగా ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు కూల్చాడు ఆపిల్. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడికి అనుభవం లేదు. అయినప్పటికీ అతడి నైపుణ్యాల కారణంగా కనీస ధర రూ. 20లక్షలకైనా అమ్ముడుపోయే అవకాశం ఉంది.రాజ్ లింబానిఅండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టులో రాజ్ లింబాని సభ్యుడు. 2024లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు కూల్చాడు. కొత్త బంతితో అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అతడు అదరగొట్టాడు. డెత్ ఓవర్లలోనూ తనదైన శైలిలో రాణించాడు.ఆకాశ్ మధ్వాల్2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు ఆకాశ్ మధ్వాల్. ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటాడు. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్‌కు మారి అక్కడా తనను తాను నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్లో 17 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఈ యార్కర్ల కింగ్ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. ఉత్తరాఖండ్ తరపున ఆరు మ్యాచ్‌లలో మూడు వికెట్లే తీశాడు. అయితే, అతడి అనుభవం దృష్ట్యా ఈసారి మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.అశోక్ శర్మసయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో రాజస్తాన్ తరఫున సత్తా చాటుతున్నాడు అశోక్ శర్మ. ఇప్పటికి ఏడు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 19 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు నెట్‌బౌలర్‌గా పనిచేసిన అశోక్ శర్మ ఈసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు.


