'ఐపీఎల్‌ కాదు.. టీమిండియాకు ఆడడమే నా టార్గెట్‌' | Auqib Nabi Sets Sights On Ultimate GoalOf Playing For India With Successful IPL | Sakshi
Sakshi News home page

IPL 2026: 'ఐపీఎల్‌ కాదు.. టీమిండియాకు ఆడడమే నా టార్గెట్‌'

Mar 27 2026 9:14 PM | Updated on Mar 27 2026 9:17 PM

Auqib Nabi Sets Sights On Ultimate GoalOf Playing For India With Successful IPL

జమ్మూ కాశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీ ధార్‌ ఐపీఎల్‌ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నబీ ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుండడంతో గతేడాది జరిగిన మినీ వేలంలో నబీని రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

కేవలం రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీనీ ఇతరు ఫ్రాంచైజీలతో పోటీపడి మరి ఢిల్లీ సొంతం చేసుకుంది. అయితే తాజాగా విలేకరుల సమావేశంలో నబీ పలు విషయాలను పంచుకున్నాడు. వేలం రోజు తన ఇంట్లో జరిగిన సందడిని నబీ గుర్తు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్‌ ఎంపిక కావడం సంతోషంగా ఉన్నప్పటికి, భారత్‌ తరపున ఆడడమే తన అంతిమ లక్ష్యమని నబీ తెలిపాడు.

"నాకు డబ్బు ముఖ్యం కాదు. కనీసం ఒక్కసారైనా ఐపీఎల్‌ వంటి మెగా టోర్నమెంట్‌లో ఆడాలనుకున్నాను. నాకు కనీస ధర రూ.30 లక్షలు వచ్చి ఉన్నా కూడా నేను సంతోషంగా ఉండేవాడిని. ఏదేమైనప్పటికి ఢిల్లీ ఇంత భారీ మొత్తం వెచ్చించి తీసుకోవడం నాకు ఆనందం కలిగించింది. 

వేలం రోజున నేను ఇంట్లోనే ఉన్నాను. వేలంలో నేను అమ్ముడుపోగానే బయట నం డ్యాన్స్‌లు చేస్తూ, బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. నా కటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు. ఆ సమయంలో నేను కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. కానీ నేను ఇంట్లో ఉన్నానని వారికి తెలియదు. అయినప్పటికి నా విజయాన్ని వారు సెలబ్రేట్‌ చేసుకున్నారు. 

ఐపీఎల్‌ నా కెరీర్‌ను మరింత ముందుకు తెసుకువెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి టోర్నమెంట్. దేశవాళీ క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తానే ఇక్కడ ఆడే అవకాశం లభిస్తోంది. నేను రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో బాగా రాణించానని అన్పిస్తోంది. అందుకే నాకు ఆడే అవకాశం దక్కింది. ఇక్కడ కూడా బాగా రాణించి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా అంతిమ లక్ష్యమని" నబీ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌.. ఆర్సీబీకి భారీ షాక్‌


 

Advertisement
 
Advertisement
Advertisement