ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌.. ఆర్సీబీకి భారీ షాక్‌ | RCB Coach Flower Confirms Hazlewood Will Miss Season Opener Against SRH, Check Out Reason Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌.. ఆర్సీబీకి భారీ షాక్‌

Mar 27 2026 8:01 PM | Updated on Mar 28 2026 1:30 PM

RCB coach Flower confirms Hazlewood will miss season-opener against SRH

ఐపీఎల్‌-2026 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 

స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్‌ కోచ్‌ అండీ ఫ్లవర్‌ ధ్రువీకరించాడు. హాజిల్‌వుడ్‌ గురువారం జట్టుతో చేరి ప్రాక్టీస్‌ చేసినప్పటికి, అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేడు.

"ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మా మొదటి మ్యాచ్‌కు జోష్‌ హాజిల్‌వుడ్‌ అందుబాటులో లేడు. అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. జోష్‌ నిన్ననే మా జట్టుతో చేరాడు. అతడిపి ఫిట్‌నెస్‌ను మా వైద్యబృందం పరీక్షించనుంది. తర్వాతే తదుపరి మ్యాచ్‌లకు అతడి అందుబాటుపై నిర్ణయం తీసుకుంటాము" అని ప్రీ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో ఫ్లవర్‌ పేర్కొన్నాడు. కాగా ఈ జింబాబ్వే మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

"కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడు, ఈసారి మరిన్ని పరుగులు సాధించాలన్న కసితో ఉన్నాడు. అతడు బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఈ సీజన్‌లో పరుగుల వరద పారించడం ఖాయమనిపిస్తోంది" అని ఫ్లవర్‌ అన్నారు.

బెంగళూరు తుది జట్టు(అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ.
చదవండి: IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం?
 

Advertisement
 
Advertisement
Advertisement