ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం? | SRH predicted XI vs RCB, IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం?

Mar 27 2026 6:41 PM | Updated on Mar 27 2026 6:41 PM

SRH predicted XI vs RCB, IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. మార్చి 28న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎస్‌ఆర్‌హెచ్ ఢీకొట్టనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆరెంజ్ ఆర్మీ అన్ని విధాల సిద్దమైంది.

అయితే ఈ మ్యాచ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేడు. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం.

గత ఏడాదిలాగే ఎస్‌ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ తమ టాప్ ఆర్డర్‌ను కొనసాగించనుంది. ఓపెనర్లుగా విధ్వంసకర ప్లేయర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో ఇషాన్ కిషన్‌, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ రానున్నారు. కిషన్ గత సీజన్‌లో మూడో స్ధానంలోనే బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతమైన సెంచరీ సాధించాడు.

ఇక ఐదో స్ధానంలో హెన్రిచ్ క్లాసన్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోన్‌, అనికేత్ వర్మలు ఫినిషర్ పాత్రను పోషించనున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే ప్యాట్ కమ్మిన్స్ స్ధానాన్ని ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్‌తో భర్తీ చేసే సూచనలు కన్పిస్తున్నాయి.

దూబే అరంగేట్రం?
కార్స్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడు. హర్షల్ పటేల్, శివమ్ మావి, జయదేవ్ ఉనద్కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అదేవిధంగా విధ‌ర్బ స్పిన్న‌ర్ హ‌ర్ష్ దూబే ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది. అయితే గ‌త సీజ‌న్‌లో ఆక‌ట్టుకున్న జేషాన్ అన్సారీ కూడా తుది జ‌ట్టు రేసులో ఉన్నాడు.

కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఒక రంజీ సీజ‌న్‌లో అత్య‌ధిక వికెట్లు(69) వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. దీంతో గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో రూ.30 ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌కు అత‌డిని ఎస్ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.

ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్‌, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, శివమ్ మావి
చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ?

Advertisement
 
Advertisement
Advertisement