టీమిండియా ప్లేయర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. విండీస్‌ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! | Naman Dhir takes controversial catch to dismiss Keacy Carty in IND vs WI 2nd ODI | Sakshi
Sakshi News home page

IND vs WI: టీమిండియా ప్లేయర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. విండీస్‌ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌!

Sep 30 2026 4:04 PM | Updated on Sep 30 2026 4:17 PM

Naman Dhir takes controversial catch to dismiss Keacy Carty in IND vs WI 2nd ODI

PC: BCCI/X

గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా ఆట‌గాడు న‌మ‌న్ ధీర్ సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. ఈ పంజాబీ ప్లేయర్ అద్భుతమైన క్యాచ్‌తో విండీస్ ఓపెనర్ కీస్ కార్టీని పెవిలియన్‌కు పంపాడు. అయితే కార్టీ ఔటైనప్పటికి నమన్‌ పట్టిన క్యాచ్ మాత్రం వివాదస్పదమైంది.

అసలేం జరిగిందంటే?
విండీస్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఆఖరి బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల గుడ్ లెంగ్త్ డెలివరీగా విసిరాడు. ఆ బంతిని కార్టీ కవర్ పాయింట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించగా, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న నమన్ ధీర్ ముందుకు డైవ్ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే నమన్ ధీర్ బంతిని నేల తాకకుండా క్లీన్‌గా పట్టుకున్నాడా లేదా అనే విషయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్లు సందేహపడి, తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు.

థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించి ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో కార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అది నాటౌట్ అంటూ తీవ్ర అసంతృప్తితో తల ఊపుతూ పెవిలియన్‌కు బాటపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు కూడా ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది ఇది క్లియర్ ఔట్ అంటుంటే, మరికొందరేమో బంతి నేలకు తాకిందని కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (101) మెరుపు సెంచరీతో చెలరేగడంతో విండీస్ 25 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement