breaking news
Naman Dhir
-
భారత్‌తో మ్యాచ్.. పాక్ ఆటగాడి ఓవరాక్షన్! వీడియో
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్-ఎకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ షాహీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (75) ఆజేయంగా నిలిచి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.మసూద్ చీప్ టాక్టిక్స్..అయితే ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాక్ స్పిన్నర్ సాద్ మసూద్ ఓవరాక్షన్ చేశాడు. ఇండియా-ఎ వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ నమన్ ధీర్ కేవలం మంచి టచ్‌లో కన్పించాడు. దీంతో అతడిని ఔట్ చేసేందుకు పాక్ కెప్టెన్‌ను సాద్ మసూద్‌ను ఎటాక్‌లో తీసుకొచ్చాడు. దీంతో 8 ఓవర్ వేసిన మసూద్ బౌలింగ్‌లో నమన్ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు.ఈ క్రమంలో మసూద్ సెలబ్రేషన్స్ శ్రుతుమించాయి. నమన్ వైపు చూస్తూ ఇక ఆడింది చాలు అన్నట్లు సీరియస్‌గా సెండ్-ఆఫ్ ఇచ్చాడు. నమన్ మాత్రం అతడితో ఎటువంటి వాగ్వాదానికి దిగకుండా డగౌట్‌కు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్ ప్లేయర్ల తీరు అంతేనాని కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా మసూద్‌కు భారత్ ప్లేయర్లు వడ్డీతో సహా రిటర్న్ గిప్ట్ ఇచ్చేస్తారని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇరు జట్లు మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 79-1 తో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. 57 పరుగుల వ్యవధిలో మొత్తం 9 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీSaad Masood with a wicket 👏🏽 #PAKvIND pic.twitter.com/G3Qh0RhTRp— Usman (@jamilmusman_) November 16, 2025 -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లోనే శతక్కొట్టి..
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి అద్బుత ప్రదర్శనతో దుమ్ములేపాడు. ఆసియా క్రికెట్ మండలి (ACC) పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.ఈ టీ20 ఈవెంట్లో భాగంగా భారత్-‘ఎ’ జట్టు తమ తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ ప్రియాన్ష్ ఆర్య వేగంగా ఆడే (6 బంతుల్లో 10) ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు.కేవలం పదహారు బంతుల్లోనేఈ క్రమంలో మరో ఓపెనర్, భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధీర్‌తో కలిసి.. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. కేవలం పదహారు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత జోరును మరింత పెంచాడు.Vaibhav Sooryavanshi is putting on a fireworks show 🎇 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/1gNEz5UwHb— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025 ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ లెఫ్టాండర్ కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకుని మరోసారి సత్తా చాటాడు. వైభవ్ శతక ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. Welcome to the Boss Baby’s world 🥵Vaibhav Sooryavanshi clears the boundary like it’s nothing 🤌 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/8Qha1Edzab— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 202510 ఓవర్లలోనేవైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు.. నమన్ ధీర్ కూడా మెరుపులు (21 బంతుల్లో 33) మెరిపించడంతో 10 ఓవర్లలోనే భారత్ కేవలం వికెట్ నష్టపోయి 149 పరుగులు చేయడం మరో విశేషం. ఇక 12వ ఓవర్ తొలి బంతికి ముహమ్మద్ ఆర్ఫాన్ బౌలింగ్‌లో ముహమ్మద్ రోహిద్ ఖాన్‌కు నమన్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కాగా వైభవ్, నమన్ రెండో వికెట్‌కు 57 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం. నమన్ స్థానంలో కెప్టెన్ జితేశ్ శర్మ నాలుగో నంబర్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరకాగా 12.3 ఓవర్లో ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో అహ్మద్ తారిక్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు సాధించి.. మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల వద్ద నిలిచింది.చదవండి: గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే -
వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో కీలక పోరులో విజయం సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. కాగా గతేడాది హార్దిక్ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే.టాప్-4లో అడుగుఇక ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలోనూ వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చిన హార్దిక్ సేన.. బుధవారం ఢిల్లీపై గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది.సూర్య, నమన్ ఫటాఫట్సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్) వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(6)ను అవుట్ చేసి దీపక్ చహర్ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11)ను బౌల్డ్ పెవిలియన్‌కు పంపాడు.సాంట్నర్, బుమ్రా అదరగొట్టారుఆ తర్వాత మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20)ల రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్.. మరో హిట్టర్ అశుతోష్ శర్మ (18) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ (2) రూపంలో ప్రమాదకర బ్యాటర్‌ను వెనక్కి పంపడంతో పాటు.. మాధవ్ తివారి (3), ముస్తాఫిజుర్ రహ్మమాన్ (0)లను బౌల్డ్ చేసి.. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కాగా.. హార్దిక్ సేన 59 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్లో ఎనిమిదో గెలుపు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సాంట్నర్, బుమ్రాలకు బంతిని ఇచ్చేందుకు వెనుకాడను. ఎందుకంటే వారిద్దరు మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో దిట్ట.అంతేకాదు.. ఏ పని చేసినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వాళ్లిద్దరి వల్లే నా పని సులువైంది. ఈ పిచ్‌పై 160 పరుగుల రావడమే ఎక్కువ అనుకున్నాం. అలాంటి స్థితిలో సూర్య, నమన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా.. నమన్.. వికెట్ కఠినంగా మారుతున్న వేళ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’’ అని సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కేవలం మూడు పరుగులే చేశాడు. అదే విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్-2025లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ (Mumabi Indians)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు కేవలం 56. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్.. 12 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.మరోవైపు.. ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. ఈసారి కూడా ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ముంబై కేవలం రెండే గెలవడం ఇందుకు నిదర్శనం.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢీఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన హార్దిక్ సేన.. గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వైఫల్యం ముంబైపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన సమస్య‘‘ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. బ్యాటింగ్ ఆర్డర్. అవును ఇది నిజమే. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు సాధించలేకపోతున్నాడు. ఒకవేళ అతడి వైఫల్యం ఇలాగే కొనసాగితే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కుదేలవడం ఖాయం.రోహిత్ కుదురుకోకపోతే.. ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్‌కు పంపాలో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఓపెనర్‌గా రియాన్ రికెల్టన్ రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ డీసెంట్‌గా బ్యాటింగ్ చేస్తున్నారు.నమన్ ధీర్ చక్కగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇకపోతే.. విల్ జాక్స్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నా.. పర్లేదనిపిస్తున్నాడు. ఎటొచ్చీ రోహిత్ శర్మ ఫామ్‌లేమి వల్లే సమస్య. అతడు ఓపెనర్ కాబట్టి నమన్ ధీర్, విల్ జాక్స్ వంటి వాళ్లను బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక పంపాల్సి వస్తోంది.సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో?ఏదేమైనా రోహిత్ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గొప్ప టీ20 ప్లేయర్ అని.. అయితే, ఆది నుంచే దూకుడు ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్


