ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్-ఎకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ షాహీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (75) ఆజేయంగా నిలిచి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.
మసూద్ చీప్ టాక్టిక్స్..
అయితే ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాక్ స్పిన్నర్ సాద్ మసూద్ ఓవరాక్షన్ చేశాడు. ఇండియా-ఎ వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ నమన్ ధీర్ కేవలం మంచి టచ్‌లో కన్పించాడు. దీంతో అతడిని ఔట్ చేసేందుకు పాక్ కెప్టెన్‌ను సాద్ మసూద్‌ను ఎటాక్‌లో తీసుకొచ్చాడు. దీంతో 8 ఓవర్ వేసిన మసూద్ బౌలింగ్‌లో నమన్ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు.
ఈ క్రమంలో మసూద్ సెలబ్రేషన్స్ శ్రుతుమించాయి. నమన్ వైపు చూస్తూ ఇక ఆడింది చాలు అన్నట్లు సీరియస్‌గా సెండ్-ఆఫ్ ఇచ్చాడు. నమన్ మాత్రం అతడితో ఎటువంటి వాగ్వాదానికి దిగకుండా డగౌట్‌కు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్ ప్లేయర్ల తీరు అంతేనాని కామెంట్లు పెడుతున్నారు.
కచ్చితంగా మసూద్‌కు భారత్ ప్లేయర్లు వడ్డీతో సహా రిటర్న్ గిప్ట్ ఇచ్చేస్తారని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇరు జట్లు మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 79-1 తో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. 57 పరుగుల వ్యవధిలో మొత్తం 9 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
Saad Masood with a wicket 👏🏽 #PAKvIND
pic.twitter.com/G3Qh0RhTRp— Usman (@jamilmusman_) November 16, 2025


