టీమిండియా పేసర్ ఆకిబ్ నబీకి అంతర్జాతీయ అరంగేట్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత క్యాప్‌ను అందుకున్న నబీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఓవర్ నుంచే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
అతడి బౌలింగ్‌ను విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ ఉతికారేశాడు. మొత్తంగా నబీ తన మొదటి స్పెల్‌లో మూడు ఓవర్లు వేసి 11.70 ఏకానమి రేటుతో ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెంటనే అతడి స్థానంలో గుర్నూర్ బ్రార్‌ను బౌలింగ్‌కు దించాడు.
కాగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి ప్రధాన పేసర్లు ఆసియా క్రీడల కోసం జపాన్‌కు వెళ్లడంతో నబీ తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. మొదటి వన్డేలో బెంచ్‌కే పరిమితమైనప్పటికి గువాహటి మ్యాచ్‌లో డెబ్యూ చేసే అవకాశం వచ్చింది. తన వచ్చిన అవకాశాన్ని నబీ సద్వినియోగ పరుచుకులేకపోయాడు.
కనీసం తన సెకెండ్ స్పెల్‌లోనైనా కమ్‌బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. కాగా నబీకి వైట్‌బాల్ క్రికెట్ కంటే రెడ్ బాల్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. రంజీట్రోఫీ 2025-26 సీజన్ విజేతగా జమ్మూ కాశ్మీర్ నిలవడంలో నబీది కీలక పాత్ర. అతడు ఇంకా వైట్‌బాల్‌తో నిరూపించుకోవాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నితీశ్ కుమార్ రెడ్డి స్ధానంలో నబీ తుది జట్టులోకి రాగా.. విండీస్ ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.


