IND vs WI 2nd ODI Updates And Highlights: గువాహటి వేదికగా రెండో వన్డేలో భారత్-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి.
చెలరేగి ఆడుతున్న క్యాంప్‌బెల్
10 ఓవర్లకు విండీస్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో జాన్ క్యాంప్‌బెల్(69), హోప్(12) ఉన్నారు.

క్యాంప్‌బెల్ ఫిప్టీ
విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కేవలం 29 బంతుల్లోనే 7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
విండీస్ తొలి వికెట్ డౌన్
వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఓపెనర్ కీస్ కార్టీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దూకుడుగా ఆడుతున్న విండీస్ ఓపెనర్లు
విండీస్ ఓపెనర్లు జాప్ క్యాంప్‌బెల్(22), కీస్ కార్టీ(9) దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది.
గువాహటి వేదికగా రెండో వన్డేలో భారత్-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి స్ధానంలో పేసర్ అకిబ్ నబీ అరంగేట్రం చేశాడు. మరోవైపు విండీస్ ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.

భారత్ వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే తుదిజట్లు
భారత్
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధిర్, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ
వెస్టిండీస్
జాన్ కాంప్‌బెల్, కేసీ కార్టీ, షాయీ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆమిర్ జాంగో, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రోస్టన్ ఛేజ్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, జేడన్ సీల్స్, విటెల్ లావెస్


