గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. మైదానంలో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే కోహ్లి ఓ సునాయస క్యాచ్‌ను జారవిడిచాడు. విండీస్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ నమన్ ధీర్.. రెండో బంతిని షాయ్ హోప్‌కు ఆఫ్ స్టంప్ వెలుపల లెగ్‌బ్రేక్ డెలివరీగా సంధించాడు.
ఆ బంతిని హోప్ ఫ్రంట్ ఫుట్‌పై వచ్చి షార్ట్ మిడ్ వికెట్ దిశగా గట్టిగా బాదాడు. అయితే బంతి నేరుగా షార్ట్ మిడ్ వికెట్‌లో ఉన్న కోహ్లి చేతికి వెళ్లింది. కానీ ఆ బంతిని ఒడిసిపట్టుకోవడంలో కోహ్లి విఫలమయ్యాడు. అయితే బంతి చాలా వేగంగా వచ్చినప్పటికీ విరాట్ కోహ్లి లాంటి ఫీల్డర్‌కు ఇదేమి అతి కష్టమైన క్యాచేమి కాదు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ కోహ్లి క్యాచ్‌ను అందుకుని ఉండింటే నమన్ ధీర్ ఖాతాలో తొలి అంతర్జాతీయ వికెట్ చేరిండేది. కాగా ఇదే మ్యాచ్‌లో కోహ్లి కంటే ముందు కుల్దీప్ యాదవ్ కూడా హోప్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. రెండు లైఫ్‌లు రావడంతో హోప్ చెలరేగి ఆడుతున్నాడు. 77 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు.
భారత్ వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే తుదిజట్లు
భారత్
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధిర్, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ
వెస్టిండీస్
జాన్ కాంప్‌బెల్, కేసీ కార్టీ, షాయీ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆమిర్ జాంగో, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రోస్టన్ ఛేజ్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, జేడన్ సీల్స్, విటెల్ లావెస్
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) September 30, 2026


