టీమిండియాకు భారీ షాక్‌.. మ్యాచ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన స్టార్‌ | Naman Dhir appeared to suffer from Left Ankle Twist and was forced to Leave the Field | Sakshi
Sakshi News home page

IND vs WI: టీమిండియాకు భారీ షాక్‌.. మ్యాచ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన స్టార్‌

Sep 30 2026 5:06 PM | Updated on Sep 30 2026 5:53 PM

Naman Dhir appeared to suffer from Left Ankle Twist and was forced to Leave the Field

PC: BCCI/X

గువాహటి వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియాకు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆల్‌రౌండ‌ర్ నమర్ ధీర్‌ గాయం కార‌ణంగా మ్యాచ్ మ‌ధ్య‌లోనే మైదానం వీడాడు. బౌలింగ్ వేసే సమయంలో నమన్ ధీర్‌కు గాయ‌మైంది.  బంతిని విసిరిన తర్వాత అతడి ఎడమ మడమ మడతపడటంతో న‌మ‌న్ కింద‌ప‌డిపోయి నొప్పితో విలవిల్లాడాడు.

వెంటనే ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడి నొప్పి తగ్గకపోవడంతో ఓవర్ పూర్తి చేయకుండానే మైదానం వీడాడు. అతడి స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. మిగిలిన ఓవర్లలో నమన్ తిరిగి ఫీల్డింగ్‌కు వచ్చే సూచనలు కనిపించడం లేదు. కనీసం బ్యాటింగ్‌కు అయినా వస్తాడో లేదో చూడాలి మరి.

కాగా ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. టీమిండియా బౌలింగ్‌ను విండీస్ బ్యాటర్లు చీల్చి చెండాడుతున్నారు. 40 ఓవర్లకు దాటక ముందే విండీస్ స్కోర్ 300 పరుగులకు చేరింది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్‌(101) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. షాయ్ హోప్‌(97), జాంగో(81) శతకాలకు చేరువలో ఉన్నారు.
చదవండి: IND vs WI: అరెరే.. కోహ్లి ఎంత పనిచేశావు! వీడియో వైర‌ల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement