breaking news
West Indies vs Zimbabwe
-
విండీస్ బ్యాటర్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. జింబాబ్వేపై టీ20 సిరీస్ సొంతం
జింబాబ్వే పర్యటనలో ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న విండీస్ మహిళల జట్టు తాజాగా టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. హరారే వేదికగా సోమవారం జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై వెస్టిండీస్ మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే విధించిన 107 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 9.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఎబోని బ్రాత్‌వైట్ (23 బంతుల్లో 57) మెరుపు అర్థశతకంతో జట్టును విజయం దిశగా నడిపించింది. కాగా 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఎబోని విండీస్ తరఫున మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్‌సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కింది.చివర్లో రియల్లియానా గ్రిమోండ్ (23 నాటౌట్), స్టెఫానీ టేలర్ (9 నాటౌట్) లాంచనాన్ని పూర్తి చేశారు. జింబాబ్వై బౌలర్లలో ముటాసా, చిగోరాలు చెరో వికెట్ తీశారు. అంతకముందు జింబాబ్వే మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ బిలవ్డ్ బిజా (35) టాప్ స్కోరర్ కాగా, కెలిస్ నిలోవు (25), చిపో టిరిపానో (25) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జహ్జరా క్లాక్స్టన్ మూడు వికెట్లు తీయగా, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్లు చెరొక వికెట్ పడగొట్టారు. హాఫ్ సెంచరీ సాధించిన ఎబోని బ్రాత్‌వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఇరుజట్ల మధ్య నామమాత్రపు చివరి టీ20 బుధవారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.ఇదీ చదవండి: వైభవ్‌పై వేటు తప్పదా?.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
సెంచరీతో చెలరేగిన వెస్టిండీస్ కెప్టెన్
హరారే వేదికగా జింబాబ్వే వుమెన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ సెంచరీతో మెరిసింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (113 బంతుల్లో 118; 18 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ చేయగా, వికెట్ కీపర్ షిమెయిన్ క్యాంప్బెల్లె (119 బంతుల్లో 96) సెంచరీ చేజార్చుకుంది. మిగిలిన బ్యాటర్లలో జన్నిలియా గ్లాస్కో (26 నాటౌట్), జహారా క్లాక్స్టన్ (11 నాటౌట్) చివర్లో మెరిశారు. జింబాబ్వే బౌలర్లలో నొమ్వెలో సిబండ, బిజా చెరో 2 వికెట్లు తీశారు. కాగా విండీస్ కెప్టెన్‌కు ఇది 14వ సెంచరీ కాగా, అంతర్జాతీయంగా 17వ సెంచరీ కావడం విశేషం. సూపర్ ఫామ్‌లో ఉన్న హేలీ మాథ్యూస్ ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెకు తోడు షిమెయిన్ క్యాంప్బెల్లె కూడా జింబాబ్వే బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఇక ఇదే సిరీస్‌లో తొలి వన్డేలో హేలీ మాథ్యూస్ 156 బంతుల్లో 182 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి వన్డేలో విజయం సాధించిన విండీస్‌కు రెండో వన్డేలో మాత్రం జింబాబ్వే షాక్ ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. A captain's knock from Hayley Matthews in the ODI series decider as she brings up another ton in Harare 💯👏📸: @windiescricket 📝: https://t.co/6rI12PWvYw pic.twitter.com/CdUAp3mTrc— ICC (@ICC) September 30, 2026ఇదీ చదవండి: IND Vs WI: చరిత్ర సృష్టించిన విండీస్ ఓపెనర్ -
సూపర్-8లో తొలి మ్యాచ్ గెలుస్తాం: సికందర్ రజా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పసికూన జింబాబ్వే అంచనాలకు మించి రాణిస్తోంది. గ్రూప్-బిలో తొలుత ఒమన్‌ను మట్టికరిపించిన రజా బృందం.. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని రీతిలో షాకిచ్చింది.గెలుపు గాలివాటం కాదుతదుపరి ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఎలాంటి ఆటంకం లేకుండా సూపర్-8కు అర్హత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియాను ఎలిమినేట్ చేసిన జింబాబ్వే.. లీగ్ దశలో ఆఖరిగా పటిష్ట శ్రీలంకతో తలపడింది. అనూహ్య రీతిలో కొలంబో వేదికగా గురువారం శ్రీలంకను సైతం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రజా బృందం.. తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది.ఇక్కడితో ఆగిపోముసగర్వంగా గ్రూప్-బి టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జింబాబ్వే కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సికందర్ రజా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇక్కడితో ఆగిపోము. మా దృష్టి రాబోయే మ్యాచ్‌లపై ఉంది. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్‌లో ప్రదర్శనను విశ్లేషించుకుంటూ ముందుకు పోతున్నాం.మున్ముందు ఏదైనా సాధ్యమేఅన్ని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధమయ్యాం. తమ బాధ్యతలపై జట్టులో అందరికీ స్పష్టత ఉంది. తాజా ప్రదర్శనతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహం పెరిగింది. లీగ్ దశలో మా ప్రదర్శనను బట్టి చూస్తే మున్ముందు ఏదైనా సాధ్యమే. అంచనాలకు భిన్నంగా సాగే సంచలన కథనాలు అందరినీ ఆకర్షిస్తాయి కదా!..మా తొలి మ్యాచ్‌లో గెలవవచ్చు కూడా!సూపర్-8లో మేము మా తొలి మ్యాచ్‌లో గెలవవచ్చు కూడా!.. మా అభిమానుల గుండెల్లో మా స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాము. గ్రూప్ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉంది. ముందుగా చెప్పినట్లు అండర్డాగ్ స్టోరీస్ అందరికీ ఆకర్షిస్తాయి. 23 నాటి మ్యాచ్ మాకు షో టైమ్’’ అని సికందర్ రజా ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా సూపర్-8లో భాగంగా జింబాబ్వే ఫిబ్రవరి 23న వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. అనంతరం ఫిబ్రవరి 26న భారత్, మార్చి 1న సౌతాఫ్రికాతో తలపడుతుంది. జింబాబ్వేతో పాటు ఈ ప్రత్యర్థి జట్లన్నీ లీగ్ దశను అజేయంగా ముగించడం విశేషం. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో జర జాగ్రత్తPure dominance by Zimbabwe. 🇿🇼They keep their unbeaten tag alive as they brush aside Sri Lanka. 👏Next stop: The Super 8s! 🙌ICC Men’s #T20WorldCup | #AFGvCAN | LIVE NOW ➡️ https://t.co/0BcVdzugXC pic.twitter.com/pJSD74tlFs— Star Sports (@StarSportsIndia) February 19, 2026


