విండీస్ బ్యాట‌ర్ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. జింబాబ్వేపై టీ20 సిరీస్ సొంతం | West Indies Women Won-By-8 WKTS-Vs ZIM-Women-Seals-T20 Series | Sakshi
Sakshi News home page

విండీస్ బ్యాట‌ర్ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. జింబాబ్వేపై టీ20 సిరీస్ సొంతం

Oct 5 2026 6:34 PM | Updated on Oct 5 2026 6:42 PM

West Indies Women Won-By-8 WKTS-Vs ZIM-Women-Seals-T20 Series

Photo Credit: Twitter

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్ కైవ‌సం చేసుకున్న విండీస్ మ‌హిళ‌ల జ‌ట్టు తాజాగా టీ20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో సొంతం చేసుకుంది. హ‌రారే వేదిక‌గా సోమ‌వారం జ‌రిగిన రెండో టీ20లో జింబాబ్వేపై వెస్టిండీస్ మ‌హిళ‌ల జ‌ట్టు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 

జింబాబ్వే విధించిన 107 ప‌రుగుల ల‌క్ష్యాన్ని వెస్టిండీస్ 9.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఎబోని బ్రాత్‌వైట్ (23 బంతుల్లో 57) మెరుపు అర్థ‌శ‌త‌కంతో జ‌ట్టును విజ‌యం దిశ‌గా న‌డిపించింది. కాగా 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఎబోని విండీస్‌ తరఫున మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కింది.

చివ‌ర్లో రియ‌ల్లియానా గ్రిమోండ్ (23 నాటౌట్‌), స్టెఫానీ టేల‌ర్ (9 నాటౌట్‌) లాంచ‌నాన్ని పూర్తి చేశారు. జింబాబ్వై బౌల‌ర్ల‌లో ముటాసా, చిగోరాలు చెరో వికెట్ తీశారు. అంత‌క‌ముందు జింబాబ్వే మ‌హిళ‌ల జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 107 ప‌రుగులు చేసింది. 

ఓపెన‌ర్ బిల‌వ్‌డ్ బిజా (35) టాప్ స్కోర‌ర్ కాగా, కెలిస్ నిలోవు (25), చిపో టిరిపానో (25) ప‌ర్వాలేదనిపించారు. విండీస్ బౌల‌ర్ల‌లో జ‌హ్‌జ‌రా క్లాక్స్‌ట‌న్ మూడు వికెట్లు తీయ‌గా, అఫీ ఫ్లెచ‌ర్‌, స్టెఫానీ టేల‌ర్‌లు చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు. హాఫ్ సెంచ‌రీ సాధించిన ఎబోని బ్రాత్‌వైట్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య నామ‌మాత్ర‌పు చివ‌రి టీ20 బుధ‌వారం ఇదే స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ఇదీ చదవండి: వైభ‌వ్‌పై వేటు తప్పదా?.. తొలి టీ20కి భార‌త తుదిజ‌ట్టు ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement