breaking news
Amir Jangoo
-
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్
నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ (WI vs NEP) క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయీ హోప్‌నకు విశ్రాంతినిచ్చిన విండీస్ బోర్డు.. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అకీల్ హొసేన్ (Akeal Hosein)కు బాధ్యతలు అప్పగించింది.కాగా షార్జా వేదికగా వెస్టిండీస్ జట్టు నేపాల్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 27, 28, 30 తేదీల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు గురువారం తమ జట్టును ప్రకటించింది.ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుకెప్టెన్ షాయి హోప్ (Shai Hope)తో పాటు పేసర్ అల్జారీ జోసెఫ్, బ్యాటర్ జాన్సన్ చార్లెస్ వంటి కీలక ప్లేయర్లకు కూడా సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అయితే, ఈ సిరీస్‌లో అకీల్ హొసేన్ సారథ్యంలో జేసన్ హోల్డర్, ఫాబియాన్ అలెన్, కైల్ మేయర్స్ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు.ఇక ఏకంగా ఐదుగురు వెస్టిండీస్ ఆటగాళ్లు నేపాల్‌తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటర్ అకీమ్ ఆగస్టీ, ఆల్‌రౌండర్ నవీన్ బిడైసీ, స్పిన్నర్ జీషన్ మొతారా, పేసర్ రామోన్ సైమండ్స్, కీపర్ అమీర్ జాంగూ (టీ20 అరంగేట్రం)లకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది.నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుఅకీల్ హొసేన్ (కెప్టెన్), ఫాబియాన్ అలెన్, జువెల్ ఆండ్రూ, అకీమ్ ఆగస్టీ, నవీన్ బిడైసీ, జెడియా బ్లేడ్, కేసీ కార్టీ, కరీమా గోరె, జేసన్ హోల్డర్, అమీర్ జాంగూ, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, జీషన్ మొతారా, రామోన్ సైమండ్స్, షమార్ స్ప్రింగర్.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ తర్వాత.. సీనియర్లతో కూడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియాతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విండీస్ తమ జట్టు వివరాలను వెల్లడించింది.టీమిండియాతో టెస్టులకు విండీస్ జట్టు వివరాలురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తేజ్ నారాయణ్ చందర్‌పాల్, బ్రెండన్ కింగ్, కెవ్లాన్ అండర్సన్, షై హోప్, జాన్ క్యాంప్‌బెల్, అతనాజ్, ఇమ్లాక్, గ్రీవ్స్, అండర్సన్ ఫిలిప్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, ఖారీ పైర్, జోమెల్ వారికాన్. చదవండి: ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు! -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడికి చోటు
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 18 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్(Pakistan) పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా విండీస్ ఆతిథ్య పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ముల్తాన్ వేదికగా ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది.ఈ క్రమంలో ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ అమీర్ జంగూ(Amir Jangoo)కు తొలిసారి విండీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. జంగూ ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్రంలోనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా జంగూ వరల్డ్ రికార్డు సృష్టించాడు.అంతేకాకుండా దేశీవాళీ రెడ్ బాల్ టోర్నీల్లో సైతం అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు గాయం కారణంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరమైన స్పిన్నర్ గుడాకేష్ మోతీ తిరిగి ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.అదేవిధంగా విండీస్ స్పీడ్ స్టార్ షమర్ జోసెఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరో స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ ఇతర ఒప్పందాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. జోసెఫ్ సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ఆడనున్నాడు.వెస్టిండీస్ టెస్టు జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా, అలిక్ అథానాజ్, కీసీ కార్తీ, జస్టిన్ గ్రీవ్స్, కావెం హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అమీర్ జాంగూ, మైకిల్ లూయిస్, గుడాకేష్ మోటీ, అండర్సన్ ఫిలిప్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్చదవండి: రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత.. 16 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసకర శతకం


