వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్‌ సెంచరీ వీరుడికి చోటు | West Indies Announce Test Squad for Pakistan Tests | Sakshi
Sakshi News home page

WI vs PAK: వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్‌ సెంచరీ వీరుడికి చోటు

Dec 24 2024 2:52 PM | Updated on Dec 24 2024 5:23 PM

West Indies Announce Test Squad for Pakistan Tests

వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టు 18 ఏళ్ల త‌ర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్(Pakistan) ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా విండీస్ ఆతిథ్య పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌లప‌డ‌నుంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ముల్తాన్ వేదిక‌గా ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది.

ఈ క్ర‌మంలో ఈ సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును వెస్టిండీస్ క్రికెట్ ప్ర‌క‌టించింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అమీర్ జంగూ(Amir Jangoo)కు తొలిసారి విండీస్ టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. జంగూ ఇటీవ‌లే బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేతో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. త‌న అరంగేట్రంలోనే అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. త‌ద్వారా వ‌న్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్‌గా జంగూ వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు.

అంతేకాకుండా దేశీవాళీ రెడ్ బాల్ టోర్నీ‍ల్లో సైతం అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు గాయం కారణంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరమైన స్పిన్నర్ గుడాకేష్ మోతీ తిరిగి ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.

అదేవిధంగా విండీస్ స్పీడ్ స్టార్ షమర్ జోసెఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరో స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ ఇత‌ర ఒప్పందాల కార‌ణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. జోసెఫ్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025లో ఆడ‌నున్నాడు.

వెస్టిండీస్ టెస్టు జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా, అలిక్ అథానాజ్, కీసీ కార్తీ, జస్టిన్ గ్రీవ్స్, కావెం హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అమీర్ జాంగూ, మైకిల్ లూయిస్, గుడాకేష్ మోటీ, అండర్సన్ ఫిలిప్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్
చదవండి: రుతురాజ్‌ గైక్వాడ్‌ ఊచకోత.. 16 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసకర శతకం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement