Asian Games Men's Cricket: శ్రీలంక జట్టుకు కాంస్యం | Asian Games Mens Cricket: Sri lanka Wins Bronze medal | Sakshi
Sakshi News home page

Asian Games Men's Cricket: శ్రీలంక జట్టుకు కాంస్యం

Oct 3 2026 8:55 AM | Updated on Oct 3 2026 8:55 AM

Asian Games Mens Cricket: Sri lanka Wins Bronze medal

source: X

ఏషియన్‌ గేమ్స్‌ 2026 పరుషుల క్రికెట్‌లో శ్రీలంక జట్టు కాంస్య పతకం సాధించింది. ఇవాళ జరిగిన బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్‌లో ఆ జట్టు బంగ్లాదేశ్‌పై 63 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 17.3 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలి, ఓటమిపాలైంది.

రాణించిన రత్నాయకే
ఏడో నంబర్‌ బ్యాటర్‌ తరిండు రత్నాయకే (65) అర్ద సెంచరీతో రాణించడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. అతడికి కెప్టెన్‌ సహాన్‌ అరచ్చిగే (33) ఓ మోస్తరుగా సహకరించాడు. అషేన్‌ బండార (18) రెండంకెల స్కోర్‌ చేశాడు. మిగతా ప్లేయర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌, సైఫ్‌ హసన్‌, ముస్తాఫిజుర్‌ తలో 2 వికెట్లు తీయగా.. అల్‌ ఇస్లాం, రిషద్‌ హొసేన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ పూర్తిగా చేతులెత్తేసింది. టాప్‌-3 బ్యాటర్లు డకౌట్‌ కాగా.. మిగతా బ్యాటర్లు కూడా అడపాదడపా స్కోర్లకే పరిమితమయ్యారు. వారి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్‌ బ్యాటర్‌ నసుమ్‌ అహ్మద్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లు నువాన్‌ తుషార, రత్నాయకే, విజయ్‌కాంత్‌, వనుజ సహాన్‌ తలో 2, అరచ్చిగే, హేమంత చెరో వికెట్‌ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కాగా, మరికొద్ది సేపట్లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. 

ఇదీ చదవండి: Asian Games 2026: భారత్‌ ఖాతాలో 17వ స్వర్ణం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement