పాకిస్తాన్‌తో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి ఔట్ కాగా.. సంజూ శాంసన్ (4 బంతుల్లో 2) మరోసారి నిరాశపరిచాడు. 6 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 85-2గా ఉంది. అభిషేక్ 54, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ (వైభవ్), అహ్మద్ దానియల్ (సంజూ) తలో వికెట్ తీశారు.
కాగా, భారత్ సెమీస్‌లో శ్రీలంకను.. పాకిస్తాన్ సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఓడిన బంగ్లాదేశ్, శ్రీలంక కొద్ది సేపటి క్రితమే కాంస్య పతకం మ్యాచ్‌లో పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజేతగా నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: Asian Games 2026: స్వర్ణం కైవసం చేసుకున్న భారత గోల్ఫర్


