source: BCCI X
పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర అర్ద సెంచరీతో (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 61 పరుగులు) చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 15) వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించినా, అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (4 బంతుల్లో 2) మరోసారి నిరాశపరిచాడు. అభిషేక్ ఔటైన తర్వాత భారత్ స్కోర్ నిదానించింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 21 పరుగులు (2 ఫోర్లు), ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 20 పరుగులు (3 ఫోర్లు) చేశారు. ఆఖర్లో తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (15 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దానియల్ తలో 2, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: Asian Games Finals: వైభవ్‌కు ఎగతాళి చేసిన పాక్ బౌలర్


