Update: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బతగిలింది. మూడో ఓవర్ వేసిన జైడన్ సీల్స్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లి(0) వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో భారత్ కేవలం 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
న్యూ చండీగఢ్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలో భారత్-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి మ్యాచ్‌లో పేసర్ అన్షుల్ కాంబోజ్ భారత్ తరపున అరంగేట్రం చేశాడు.
అతడు విరాట్ కోహ్లి చేతుల మీదగా క్యాప్‌ను అందుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ గాయం కారణంగా దూరం కావడంతో కాంబోజ్‌కు డెబ్యూ చేసే అవకాశం లభించింది. అదేవిధంగా పేసర్ మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు విండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.
తుది జట్లు
వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, జ్యువెల్ ఆండ్రూ, షాయ్ హోప్ (కెప్టెన్), అమీర్ జాంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కీమో పాల్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, విటెల్ లావ్స్, జేడెన్ సీల్స్
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్


