source: BCCI X
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో భారత్ స్వర్ణం నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరి, తుది సమరంలో పాక్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Ruturaj Gaikwad & his team in 2023.
- Shreyas Iyer & his team in 2026.
TWO GOLDS IN TWO ASIAN GAMES IN MENS CRICKET - Time for Gold in LA 2028 😍❤️ pic.twitter.com/BLruOeaqh0— Johns. (@CricCrazyJohns) October 3, 2026
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 61 పరుగులు) ఆరంభంలో చెలరేగగా.. ఆఖర్లో తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు.
Dube ne kar diya dhamaal, Sundar ne catch pakda kamaal 🔥
Watch 𝐓𝐡𝐞 𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐌𝐚𝐭𝐜𝐡 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐘𝐞𝐚𝐫 - #INDvPAK in the #AsianGames2026 Gold Medal Match - LIVE NOW on #SonyLIV & #SonySportsNetwork pic.twitter.com/VgTJEXeU37— Sony LIV (@SonyLIV) October 3, 2026
మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 15) వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించినా, అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (4 బంతుల్లో 2) మరోసారి నిరాశపరిచాడు.
𝐀𝐛𝐡𝐢 toh party shuru hui hai! 🔥
Watch 𝐓𝐡𝐞 𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐌𝐚𝐭𝐜𝐡 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐘𝐞𝐚𝐫 - #INDvPAK in the #AsianGames2026 Gold Medal Match - LIVE NOW on #SonyLIV & #SonySportsNetwork 💙 pic.twitter.com/GRRvqSgWZK— Sony LIV (@SonyLIV) October 3, 2026
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 21 పరుగులు (2 ఫోర్లు), ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 20 పరుగులు (3 ఫోర్లు) చేశారు. ఆఖర్లో తిలక్‌కు జతగా శివమ్ దూబే (15 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించాడు.
పాక్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దానియల్ తలో 2, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.
భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలోనే తడబడింది. 33, 36, 39 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. హసన్ నవాజ్ (96) వీరోచితంగా పోరాడినా, లక్ష్యం మరీ పెద్దది కావడంతో పాక్ గెలుపుకు కావాల్సిన పరుగులు చేయలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులకే పరిమితమైంది.
పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ 29, మాజ్ సదాకత్ 23, కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 10, ఉస్మాన్ ఖాన్ 3, అబ్దుల్ సమద్ 9, సాద్ మసూద్ 12 (నాటౌట్) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్, సుందర్, దూబే తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడినా పాక్ రజతం సాధించింది. ఫైనల్‌కు ముందు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం గెలిచింది.
ఇదీ చదవండి: అత్యంత అరుదైన ఘనత సాధించిన ఇషాన్ కిషన్


