నవంబరులో ఓం | Mammootty-Dhanush film OM gets new release date of Nov 20 | Sakshi
Sakshi News home page

నవంబరులో ఓం

Oct 3 2026 3:46 AM | Updated on Oct 3 2026 3:46 AM

Mammootty-Dhanush film OM gets new release date of Nov 20

‘ఓం’ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. ధనుష్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ డ్రామా ‘ఓం: చాప్టర్‌ 1–ఉధిరం బ్లడ్‌ ఉడ్‌’. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి, నసీరుద్దీన్‌ షా, ఇంద్రన్స్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్‌ జగ్మగ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబరు 16న రిలీజ్‌ చేయాలనుకున్నారు. 

కానీ రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ 15న రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో ఆయనపై ఉన్న గౌరవంతో  ‘ఓం’ను అక్టోబరు 16న రిలీజ్‌ చేయడం లేదని ఇటీవల ధనుష్‌ పేర్కొన్నారు. తాజాగా ‘ఓం’ చిత్రాన్ని నవంబరు 20న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త  పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కొన్ని వాస్తవ సంఘటనలతో స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement