సెమీస్‌కు దూసుకెళ్లిన గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం | Treesa Jolly-Gayatri Gopichand Enter Semi-Finals, Assure India Of A Medal | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు దూసుకెళ్లిన గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం

Aug 21 2026 3:37 PM | Updated on Aug 21 2026 3:50 PM

Treesa Jolly-Gayatri Gopichand Enter Semi-Finals, Assure India Of A Medal

న్యూఢిల్లీ వేదికగా జరుగున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ - గాయత్రి గోపీచంద్ సత్తాచాటారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చైనాకు చెందిన నాలుగో సీడ్ జై యి ఫాన్ - జాంగ్ షు క్సియాన్‌పై విజయం సాధించిన ఈ భారత జంట.. సెమీస్‌కు దూసుకెళ్లింది. 

దీంతో 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్‌ విభాగంలో భారత్‌కు పతకం రానుంది. చివరిసారిగా 2011లో లండన్‌ వేదికగా జరిగిన టోర్నమెంట్‌లో అశ్విని పొన్నప్ప - జ్వాలా గుత్తా జోడీ కాంస్య పతకం సాధించింది. ఇక క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విషయానికి వస్తే.. గాయత్రి- ట్రీసా జాలీ జోడీ తొలి గేమ్‌ను  16-21తో కోల్పోయింది. 

కానీ రెండో గేమ్‌లో భారత షట్లర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. హోరాహోరీగా సాగిన రెండోగేమ్‌లో 21-15 తేడాతో భారత్‌ గెలిచి సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ గాయత్రి-ట్రీసా సత్తాచాటారు. 21-13 తేడాతో చైనా జోడీని చిత్తు చేసి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను భారత జంట సొంతం చేసుకుంది. కాగా గాయత్రి గోపీచంద్‌ ఇటీవలే అర్జున అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement