ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్‌..! | 64-year-old man completes MTech, plans IIM Lucknow course | Sakshi
Sakshi News home page

ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్‌..! ఓ తండ్రి సక్సెస్‌ స్టోరీ..

Aug 21 2026 12:17 PM | Updated on Aug 21 2026 12:21 PM

64-year-old man completes MTech, plans IIM Lucknow course

పదవీవిరమణ వయసు వచ్చేటప్పటికీ కాస్త వేటిపై అంత ఆసక్తి ఉండదు. ముఖ్యంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి చాలా అరుదు. ఒకవేళ ప్రయత్నించినా మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఈ పెద్దయన రిటైర్‌ అయిపోయాక కూడా మరో ఉద్యోగంలో కొనసాగుతూ..ఎంటెక్‌ పూర్తి చేశాడు. అంతేకాదండోయ్‌ తన తరగతిలో టాప్‌ 10 విద్యార్థులలో ఒకరిగా నిలవడం విశేషం. అందుకు సంభందించిన విషయాన్ని ఆయన కుమారుడు శశాంక్‌​ శ్రీవాస్తవ్‌ నెట్టిట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

శశాంక్‌ శ్రీ వాస్తవ సోషల్‌ మీడియా పోస్ట్‌ ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు. “ 64 ఏళ్ల వయసులో మా నాన్నగారు ఎం.టెక్ పూర్తి చేశారు. గతనెలలోనే ఈ కోర్సుని పూర్తి చేశారు. ఆయన వయసులో సగం వయసున్న విద్యార్థులతో పోటీపడి మరీ..టాప్ 10లో నిలిచారు. ఆయన కేవలం రిటైర్డ్‌ వ్యక్తి మాత్రమే కాదని 2022లో పదవీవిరమణ చేసిన వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్లను పర్యవేక్షంచే నియంత్రణ సంస్థలో డిప్యూటీ సీఈవోగా చేరారు. 

ఆయన ప్రతి వారం రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యికిలోమీటర్లు మేర జిల్లాలను సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో పనులను సమీక్షిస్తారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ..తన తండ్రి చదువుకోవడానికి సమయం కేటయించుకుంటారు. ఆ ప్రయాణాల మధ్యలోనే నోట్స్‌ రాసుకుని వాటిని చదివి, యువ విద్యార్థుల కంటే మెరుగ్గా పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మా నాన్న గారు" అని రాసుకొచ్చారు. 

అయినా జీవితం మరింత బిజీగా మారేక్దొద్దీ చాలామంది నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టిపెట్టడం మానేస్తుంటారని, అది తాను చూశానని అన్నాడు. అంతేగాదు జీవితంలో ఇక కొత్తగా నేర్చకోవాలనే ఆశ ఉన్నా..ప్రాధాన్యత మాత్రం ఇవ్వలేరని, వాస్తవికతలో అది ఆచరణసాధ్యం కూడానని చెప్పుకొచ్చాడు. అయితే తన తండ్రి అలాంటి ఆలోచనను దరిదాపుల్లోకి రానివ్వలేదని, ఆయన 40, 60ల కూడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టేవారని అన్నారు. 

ఇక తన తండ్రి ఎంటెక్‌తో ఆగడం లేదని, ఐఐఎం లక్నోలో ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లో చేరడం ఆయన తదుపరి లక్ష్యమని అన్నాడు. పైగా చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకోవడం మానేసే వయసులో దరఖాస్తు పత్రాలు నింపుతారని అన్నాడు. 

అందువల్ల తనకు నైపుణ్యాను పెంపొందించుకోవడంలో ప్రేరణ పొందాల్సిన అవసరం ఏర్పడలేదని ఎందుకంటే అది అది తన డీఎన్‌ఏలోనే ఉందని చమత్కరిస్తూ.. పోస్ట్‌ని ముగించారు శశాంక్‌ శ్రీ వాస్తవ్‌. చాలామంది నెటిజన్లు చదువు కొనసాగించడంపై స్ఫూర్తిని నింపిందన్నారు. ఆయన్ను చూసి చాలా గర్వపడాలి, చాలా నేర్చుకోవాలి కూడా అంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement