సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో గోమతీ నగర్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఒక బ్యాంకు ఉద్యోగి తన భార్యను, చెల్లిని కాల్చి చంపి, ఆపై తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్భ్రాంతి రేపింది. ఈ జంటల హత్య వెనుక అసలు రహస్యాన్ని అతను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టాడు.
మృతుడు మానస్ వాజ్‌పేయ్ (38)ఎస్‌బీఐలో పనిచేసేవాడు. గోమతీ నగర్‌లోని ICICI బ్యాంక్ బ్రాంచ్‌లో భార్య దివ్య మిశ్రా (37) రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తోంది.ఆటోరిక్షాలో వేచి ఉన్న భర్త పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరాయ్యాడు. ఆతరువాత గోమతి నగర్‌లో ఇంటికెళ్లి దివ్యాంగురాలైన తన సోదరి శివా వాజ్‌పేయ్‌నుని కాల్చి చంపాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో ఒక మెసేజ్ పెట్టిన అనంతరం ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’
ఈ ఘాతుకానికి పాల్పడే ముందు ‘‘నా భార్య నన్ను మోసింది, అందుకే చంపేసా. ఇపుడు నా సోదరి, నేను కూడా చనిపోవాలి. ఈ విషయాలన్నీ ఆమె సోదరి ప్రజ్ఞ , భరత్‌కు అంతా తెలుసు’’ అంటూ స్టేటస్ పెట్టారు. అయితే తాను పోయిన తరువాత దివ్యాంగురాలైన తన28 ఏళ్ల సోదరిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే కారణంతో అతను ఆమెను చంపినట్లు భావిస్తున్నారు. దివ్య మిశ్రా సోదరి,జర్నలిస్ట్ ప్రజ్ఞా మిశ్రా యూపీ పోలీసుల అధికారిక హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి
కాగా మానస్ వాజ్‌పేయ్, దివ్య మిశ్రాలకు పెళ్లై 12 సంవత్సరాలు అయింది. వారికి పిల్లలు లేరు.భార్య ఏడాది క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం


