భర్త బంధువుతో భార్య వివాహేతర సంబంధం.! | Wife Second Marriage Incident In Palnadu | Sakshi
Sakshi News home page

భర్త బంధువుతో భార్య వివాహేతర సంబంధం.!

Aug 19 2026 11:54 AM | Updated on Aug 19 2026 12:05 PM

Wife Second Marriage Incident In Palnadu

పల్నాడు: విడాకులు తీసుకోకుండానే తన భార్య రెండో పెళ్లి చేసుకుందని మైదుకూరు పట్టణంలోని రాజీవ్‌ గాంధీ నగర్‌కు చెందిన కాకిమాను వెంకట నరేష్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. రాజీవ్‌ గాంధీ నగర్‌కు చెందిన రెడ్డప్ప కుమారుడు వెంకట నరేష్‌కు పల్నాడు జిల్లా చిన్నకొండాయపల్లెకు చెందిన తురుమెల్ల దుర్గారావు కుమార్తె ప్రవల్లికతో 2022 ఆగస్టు 13న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. 

కొన్నాళ్లకు నరేష్‌ భార్య రాజీవ్‌ గాంధీ నగర్‌కే చెందిన నరేష్‌ బంధువు అయిన తిరువాయిపాటి సందీప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయమై మామ రెడ్డప్ప, భర్త నరేష్‌.. ప్రవల్లికను మందలించారు. అది మనసులో పెట్టుకొని నరేష్‌తో, అత్తమామలతో ఆమె చీటికిమాటికి గొడవపడేది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రవల్లిక కాపురం చేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. 

తన భార్య తన బంధువైన సందీప్‌ను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో నరేష్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనస్పర్థలతో తాము దూరంగా ఉంటున్నామని, విడాకులు తీసుకోలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేష్‌ పేర్కొన్నారు. చట్టపరంగా విడాకులు తీసుకోకుండా, తన అనుమతి లేకుండా తన భార్య రెండో వివాహం చేసుకుందని తెలిపారు. తన భార్యపై, ఆమెను వివాహం చేసుకున్న సందీప్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement